Advertisement
Google Ads BL

ఈ స్టార్‌ని టాలీవుడ్ తట్టుకోగలదా..!


బాలీవుడ్‌లో.. రేసులో లేనట్లే కనిపిస్తూ, వరుస 100కోట్ల సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే స్టార్‌ అక్షయ్‌కుమార్‌. కాగా ఈయన బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయం ఆధిపత్యానికి ఎదురొడ్డి నిలిచిన రియల్‌ హీరో కూడా. ఈయనకు బాలీవుడ్‌లో 150కోట్ల మార్కెట్‌ ఉంది. అక్షయ్‌ కి  బాలీవుడ్‌ రెమ్యూనరేషన్‌ 50కోట్లకు పైమాటే. ఆ విషయానికి వస్తే మన స్టార్‌ హీరోల సినిమా బడ్జెట్‌కు ఇది సమానం. కాగా ఏడాదికి మినిమం నాలుగైదు చిత్రాలు చేసే ఖిలాడీ ఈమధ్య దక్షిణాది చిత్రాలపై కన్నేశాడు.

Advertisement
CJ Advs

తాను కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో చిత్రాలు చేయడానికి సిద్దమని ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన రజనీ-శంకర్‌ల కాంబినేషన్‌లో రూపోందుతున్న '2.0' చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో ఆయన 12 గెటప్‌లలో కనిపించనున్నాడట. దీంతో ఈ చిత్రానికి బాలీవుడ్‌లో కూడా విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. ఇక త్వరలో ఆయన చిరంజీవి నటించే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రంలో ఓ కీలకమైన పాత్రను చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఇక ఆయన త్వరలో విజయ్‌, ప్రభాస్‌ వంటి హీరోల చిత్రాలలో కూడా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో 'రౌడీ రాథోడ్‌' చిత్రంలో అక్షయ్‌తో కలిసి ఓ పాటలో విజయ్‌ చిందులేశాడు. కాగా ఇటు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లను టార్గెట్‌ చేసే దక్షిణాది స్టార్స్‌కి అక్షయ్‌ని పెట్టుకోవడం సాధ్యమవుతుందే గానీ చిరంజీవి, విజయ్‌ వంటి ఒకే భాషకు పరిమితమయ్యే స్టార్స్‌ మాత్రం అక్షయ్‌ రెమ్యూనరేషన్‌ను తట్టుకోవడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs