'సరైనోడు, ధృవ, ఖైదీ నెంబర్150, విన్నర్, కాటమరాయుడు' వంటి చిత్రాలతో ఆడియో వేడుకల స్థానంలో ప్రీరిలీజ్ వేడకల ట్రెండ్ మొదలైంది. చాలా మంది ఇదే రూట్‌ను ఫాలో అవుతున్నారు. మనకి తెలిసినంతలో చివరగా ఆడియో ఫంక్షన్ చేస్తుకున్న స్టార్ చిత్రం బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' అనే చెప్పవచ్చు. కాగా మెగాఫ్యామిలీ మొదలుపెట్టిన ఈ నయా ట్రెండ్‌కు విభిన్న చిత్రాలను ఎంచుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ అడ్డుకట్ట వేస్తున్నాడు.
ఆయన 'లోఫర్' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. గాయం పాలయ్యాడు. ఇక ఆయన ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాలు 'మిస్టర్, ఫిదా'లు తక్కువ గ్యాప్‌లోనే విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక శ్రీనువైట్ల కెరీర్‌కు కీలకంగా మారిన 'మిస్టర్' చిత్రం ఏప్రిల్14న విడుదలకు సిద్దమవుతోంది. మరోపక్క మిక్కీజే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈయన మెగాఫ్యామిలీ హీరోలు ఆపేసిన ఆడియో ఫంక్షన్‌లకు మరలా తెరతీస్తున్నాడు.
కాగా ఈ చిత్రంలో లావణ్యత్రిపాఠి, హెబ్బా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐటంసాంగ్‌కు హాట్ యాంకర్ శ్రీముఖిని చేయిద్దామని భావించారట. కానీ ఆమె మరీ పొట్టిగా, బొద్దుగా ఉండటంతో ఆరడుగులకు పైగా ఎత్తున్న వరుణ్ పక్కన బాగుండని భావించి ఆమె స్థానంలో 'బాహుబలి' చిత్రంలో 'మనోహరి...' పాటలో నటించిన ఓ మోడల్‌తో తీస్తున్నారని తెలుస్తోంది.