అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'డీజే... దువ్వాడ జగన్నాథం' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో, టీజర్ తో సంచలనాలు క్రియేట్ చేస్తున్న 'డీజే' మే లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ 'డీజే' చిత్రం కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ - రైటర్ వక్కంతం వంశీ కాంబినేషన్ మూవీ స్టార్ట్ కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం కూడా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుందని సమాచారం.
ఇక ఈ చిత్రానికి అప్పుడే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారని 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే టైటిల్ ని వక్కంతం, అల్లు అర్జున్ చిత్రానికి టైటిల్ గా పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఇప్పుడొక ఆసక్తికర వార్త వినబడుతుంది. అదేమిటంటే అలనాటి స్టార్ హీరో...ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడని చెబుతున్నారు.
తెలుగులో సుపరిచితుడు అయిన 'ఒకే ఒక్కడు, జెంటిల్మన్' చిత్రాల హీరో అర్జున్ ఈ అల్లు అర్జున్ చిత్రం లో నటించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే అర్జున్ హీరో, విలన్ పాత్రలే కాకుండా కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు భాషల్లో నటిస్తున్నాడు. అందుకే అల్లు అర్జున్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం వంశీ.. అర్జున్ ని ఎంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈవిషయం ఇంకా అధికారికంగా ప్రకటించవలసి వుంది.