సంగీత దిగ్గజం కీరవాణి గతంలో నేను ఇక సంగీతం నుండి శాశ్వత విరామం తీసుకోబోతున్నాని చెప్పి సంగీత ప్రియులకి హోల్ సేల్ గా షాక్ ఇచ్చారు. అయితే ఆయన బాహుబలి ద కంక్లూజన్ సినిమా పూర్తవగానే ఆయనెక్కడ సంగీతం నుండి రిటైర్ అవుతారో అని కంగారు పడి ఆయన్ని ఇంకా సంగీతంలోనే కొనసాగమని చాలామంది మద్దతు తెలిపారు. అలాగే కీరవాణి కుటుంబ సభ్యులు కూడా ఆయన రిటైర్మెంట్ ఒప్పకోవడంలేదు. అయితే కీరవాణి తాను సంగీతం నుండి రిటైర్ అవ్వడానికి ఇంకా సమయం ఉందని... తనని ఇంకా సంగీత ప్రపంచంలో ఉండాలని 99 శాతం మంది కోరుకుంటున్నారని అందుకే తన శ్రేయోభిలాషుల కోసం అభిమానుల కోసం ఈ నిర్ణయాన్ని వాయిదా వేశానని ట్వీట్ చేసి సంగీత ప్రియులకి నెత్తిన పాలు పోశారు.
అలాగే ఆయన మరి కొన్ని సంచలన ట్వీట్స్ చేసి విస్మయానికి గురిచేశారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా వుండే కీరవాణి మొదటిసారి ఇలా ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచాడు. నేను 27 ఏళ్ళ క్రితం నా సంగీత జర్నీ స్టార్ట్ చేసానని... ఈ జర్నీలో కొంతమంది తనకు నచ్చినవారు వున్నారని మరికొంతమంది నచ్చనివారు కూడా వున్నారని చెప్పి ఆశ్చర్య పరిచాడు. కొంతమంది దర్శకులుకు నేను చెప్పే సలహాలు పాటించేవారని... కొంతమంది తన సలహాలు పట్టించుకునే వారు కాదని... అయినా అలాంటి దర్శకులతో నేను సినిమాలకు వర్క్ చేశానని ట్వీట్ చేశారు.
అలాగే నేను, రాజమౌళి ఒక్కడికే అంతటి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాను అంటే రాజమౌళి నేను ఎం చెప్పినా కాదనకుండా వినేవాడని...... అందుకే నేను స్వేచ్ఛగా తనకి మంచి మ్యూజిక్ ఇవ్వగలిగానని అన్నారు. అంతేకాకుండా తాను రిటైర్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆ సమయం ఎప్పుడు వస్తుందో? అని సంచలనాత్మ ట్వీట్స్ చేసాడు కీరవాణి.