పవన్‌కళ్యాణ్ తీరే డిఫరెంట్. ఆయన సక్సెస్‌లో, బిజీగా ఉండే దర్శకులు, హీరోయిన్ల జోలికి పెద్దగా పోడు. తన చిత్రాలను తానే వన్ మ్యాన్‌షోగా నడిపించగల సత్తా తనకు ఉన్నదని ఆయన నమ్మకం. కొన్నిసార్లు ఈ పరిస్థితుల వల్ల, నిర్ణయాల వల్ల ఆయనకు చెడ్డ పేరు కూడా వచ్చింది. ఇక 'గబ్బర్‌సింగ్'లో ఆయన అప్పటివరకు ఐరన్‌లెగ్‌గా ముద్రపడిన శృతిహాసన్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక తాజాగా ఆయన 'కాటమరాయుడు' చిత్రంలో శృతితో మరోసారి జోడీ కట్టాడు. కానీ ఈ చిత్రంలో పవన్, శృతిల మద్య కెమిస్ట్రీ సరిగ్గా పండలేదని పవన్ అభిమానులు ఫీలవుతున్నారు.
ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలలోనే కాదు.. గ్లామర్ పరంగా ఆమె పాటల్లో కూడా డీగ్లామర్‌గా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచి జోష్ ఉన్న పాటల్లో కూడా ఆమె ఆకట్టుకోలేక డీలాగా, వయసు మీద పడినట్లుగా, వాడిపోయి కనిపిస్తోందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇక ఆమె పవన్‌కి ఎక్కడా సరితూగలేదని అంటున్నారు. ఇలా గ్లామర్ మీద, కాస్టూమ్స్ మీద సరిగా దృష్టి పెట్టకపోతే ఆమె కెరీర్ ఇక ముందుకు సాగదని తేల్చేస్తున్నారు.
కానీ ఇటీవల శృతి మాట్లాడుతూ, విజయాలు వస్తే ఒకలా.. పరాజయాలు వస్తే ఒకలా ఉండటం తనకు చేతకాదని, తన కెరీర్‌లో వచ్చిన పరాజయాలకు కూడా తానే బాధ్యత వహిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.