Advertisement
Google Ads BL

గ్యాప్‌ ఇచ్చాడన్నారుగా..ఇప్పుడు చూడండి!


చాలా కాలం గ్యాప్‌ తీసుకున్న తర్వాత రవితేజ 'టచ్‌ చేసి చూడు', ' రాజా ది గ్రేట్‌' వంటి విభిన్న చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపులో రవితేజ మరో చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఈ చిత్రం ఓ తమిళ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. లక్ష్మణ్‌ అనే యువ దర్శకుడు జయం రవి, అరవింద్‌ స్వామిలతో 'బోగన్‌' అనే చిత్రం తీశాడు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిత్రం తెలుగు రీమేక్‌ను రవితేజ ఓకే చేశాడు. ఈ విషయాన్ని దర్శకుడు లక్ష్మణ్‌ కన్‌ఫర్మ్‌ చేశాడు. తెలుగు వెర్షన్‌కి కూడా లక్ష్మణే దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం స్క్రిప్ట్‌ను కూడా లాక్‌ చేసేశారు. 

Advertisement
CJ Advs

ఆగష్టు నుంచి ఈ చిత్రం మొదలుకానుంది. తమిళంలో జయం రవి పోషించిన పాత్రను తెలుగులో రవితేజ పోషిస్తున్నాడు. ఇక 'ధృవ' చిత్రంతో తెలుగులో కూడా అరవింద్‌స్వామికి పెద్ద క్రేజ్‌ ఏర్పడిన రీత్యా, ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో కూడా అరవింద్‌స్వామిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే రవితేజ ఒకేసారి మూడు చిత్రాలను వెంటనే వెంటనే ఓకే చేసి తన అభిమానుల్లో ఆనందం నింపుతున్నాడు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs