గత కొన్నాళ్లుగా సరైన బ్రేక్ లేని హీరో.. మంచు విష్ణు. కాగా ఆయన ప్రస్తుతం సమకాలీన రాజకీయాల నేపథ్యంలో కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో 'ఓటర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆయన తండ్రి మోహన్‌బాబు నటించిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రం తరహాలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో ఆయన తనకు మంచి హిట్స్ ఇచ్చిన జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో త్వరలో 'ఆచారి అమెరికా యాత్ర' అనే డిఫరెంట్ మూవీ చేయనున్నాడు.
ఈ చిత్రం కథ ఓ రియల్ లైఫ్‌లో జరిగిన ఓ స్కాం ఆదారంగా వినోదభరితమైన సందేశాత్మక చిత్రంగా రూపొందనుందని సమాచారం. ఇటీవల అమెరికాలో కాల్‌సెంటర్ల పేరుతో ఎన్నారైలను మోసగించిన ఓ స్కాం ఆధారంగా ఈ చిత్రం కథను తయారు చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బ్రహ్మానందం కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. మొత్తానికి తన పోరాటాన్ని మాత్రం మంచు విష్ణు ఇంకా కొనసాగిస్తూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. మరి 'లక్కున్నోడు' అని చెప్పుకున్నా హిట్ రాని మంచు విష్ణు కి ఈ రెండు సినిమాలతో అయినా హిట్ వచ్చేనా..|