బూతు 'అవసరాలు' బాగానే ఉన్నాయి!


'ఈ రోజుల్లో, బస్టాప్‌' చిత్రాల తర్వాత మరలా అడల్ట్‌ కంటెంట్‌ చిత్రాల జోరు బాగానే పెరిగింది. 'గుంటూరు టాకీస్‌'తో పాటు మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌లు నటించిన 'ఈడో రకం.. ఆడో రకం', సుకుమార్‌ నిర్మాణంలో రాజ్‌తరుణ్‌ హీరోగా వచ్చిన 'కుమారి21 ఎఫ్‌' వంటి చిత్రాలు ఆ కోవలోవే. ఇవి బాగానే వర్కౌట్‌ అయ్యాయి. దాంతో ఇప్పుడు మన చిన్న నిర్మాతలు, దర్శకులు ఈ తరహా చిత్రాల వైపు చూస్తున్నారు. తాజాగా సెక్స్‌ 'అవసరాల' గురించి శ్రీనివాస్‌ వంటి క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న నటుడు, దర్శకుడు కూడా 'బాబు బాగా బిజీ'గా వస్తున్నాడు. 

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, పోస్టర్స్‌తోనే హీట్‌ పుట్టించింది. ఇక ట్రైలర్‌తో అది పతాక స్థాయికి చేరింది. ఇదే తరహాలో 'ఈ రోజుల్లో సీతారాముల్లా ఎవరుంటారండీ బాబూ'తో పాటు పలు చిత్రాలు రూపొందుతున్నాయి. ఇవ్వన్నీ అడల్డ్‌ చిత్రాలుగా వస్తునే చివరలో మాత్రం ఏదో ఒక నీతిమాత్రం చెబుతారు. అదేమంటే సినిమా అనేది కళాత్మక వ్యాపారం అని వాదిస్తారు. కుటుంబ సమేతంగా చూసే బుల్లితెరపైనే ఇవి విచ్చలవిడి ఉన్నప్పుడు సినిమాలలో ఉంటే తప్పేముందని వాదిస్తారు. 

బాలీవుడ్‌లో రూపొందే ఈ తరహా చిత్రాలను మన ప్రేక్షకులు ఎగబడి చూడటం లేదా? మరి తెలుగులో వస్తే తప్పేంముందనే వాదన కూడా ఉంది. ఇక 'బాబు బాగా బిజీ' చిత్రం 'హంటర్‌'కు రీమేక్‌ కావడంతో ఈ చిత్రం ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. ఇంటర్నెట్‌లో నగ్న దృశ్యాలు, శృంగారాలు చూసే వారికి ఇదో లెక్కకాదు. అయినా పెద్ద పెద్దస్టార్సే తాతల వయసులో కూడా మనవరాళ్ల వయసులో ఉన్న భామలతో సెక్సీస్టెప్స్‌ వేస్తుంటే ఇక దీనిని తప్పని కూడా చెప్పలేం. ఆ తరహా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఎప్పుడు కొదవుండదు. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES