సూపర్ స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జీకి మరోపేరు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం అప్పుడే మొదటి షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుందట. అసలు పూరి తో బాలయ్యకి సెట్ అవ్వుద్దా? అని సందేహపడిన వాళ్ళకి ఇప్పుడు వీరి స్పీడ్ చూసి అమ్మో అనుకుంటున్నారట. జెట్ స్పీడ్ డైరెక్టర్, సూపర్ ఫాస్ట్ హీరో కలిస్తే ఎలా ఉంటుందో ఇద్దరూ తమకి చూపిస్తున్నారని చెబుతున్నారు చిత్ర యూనిట్ వాళ్ళు. అసలు పూరి జగన్నాథ్ తాను ఏదైనా టైమ్ కి పూర్తి చెయ్యాలి అంటే దాన్ని సాధించి అనుకున్న టైమ్ కన్నా ముందే పూర్తి చేసేస్తాడు.
అందుకే మొదటి షెడ్యూల్ ని అంత స్పీడ్ గా ఇద్దరూ చెయ్యగలిగారని అంటున్నారు. అయితే మొదటి షెడ్యూల్ లో వీరు హెవీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారని... ఈ యాక్షన్ సన్నివేశం చిత్రానికే హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇంతలా ఒక యాక్షన్ సన్నివేశాన్ని ఇంత త్వరగా పూర్తి చెయ్యడం అనేది ఒక్క పూరి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు. ఇక ఈ యాక్షన్ సన్నివేశం నందమూరి అభిమానులకు కావాల్సినంత బూస్ట్ ఇస్తుందని పూరి అభిమానులకి భరోసా కూడా ఇస్తున్నాడట.
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ ఏప్రిల్ 5 నుండి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుందని సమాచారం.