ప్రస్తుతం అందరూ 'బాహుబలి-ది కన్‌క్లూజన్' మేనియాలో ఉన్నారు. ఈ చిత్రం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రాజన్ తనకు 'బాహుబలి2' కంటే ధనుష్ మెగాఫోన్ చేతబట్టి దర్శకత్వం వహిస్తున్న 'పవర్ పాండి' చిత్రంపైనే ఎక్కువ నమ్మకముందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ధనుష్ ఇచ్చినన్ని వరుస హిట్స్ ఎవ్వరూ ఇవ్వలేదని, 'పవర్‌పాండి', 'బాహుబలి2' కంటే గొప్పగా ఉంటుందని మితిమీరిన ప్రాంతీయ వాదం చూపించాడు.
ఇక కర్ణాటకలో కూడా కట్టప్ప సత్యరాజ్‌పై ఉన్న కోపం రూపంలో 'బాహుబలి2'ని అడ్డుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరోపక్క 'పవర్‌పాండి' చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్‌చేశారు. 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ప్రకాష్‌రాజ్ పాత్రను ముందుగా కొంచెం చేసిన తర్వాత అవమానకర రీతిలో తొలగించబడిన రాజ్‌కిరణ్.. ఇందులో 64ఏళ్ల ముసలి వాడి పాత్ర చేస్తున్నాడు. ఆ వయసులో బైక్ రేసింగ్‌లపై మోజు పడి ప్రేమలో పడే పాత్ర ఇది అని తెలుస్తోంది.
ఇక రాజ్‌కిరణ్‌తో పాటు రేవతి వంటి వారి నటన కూడా ఆకట్టుకునేలా ఉంది. హీరోగా బిజీగా ఉన్నా కూడా నటనతో పాటు గానం, సంగీతం, రచయిత, కథకుడు, గేయరచయిత.. ఇలా పలు టాలెంట్స్ ఉన్న ధనుష్ ఈ చిత్రాన్ని ఎంతో మోజు పడి ప్యాషన్‌తో డైరెక్ట్ చేశాడు. కథను కూడా ఆయనే సమకూర్చాడు. కాగా ఈ చిత్రం తమిళ ఉగాది కానుకగా ఏప్రిల్14న విడుదల కానుంది. అదే సమయంలో 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం ఏప్రిల్28న విడుదల కానుంది. దీంతో 'బాహుబలి' తమిళ హక్కులు రాజన్ నుండి వెనక్కి తీసుకోవాలని ప్రభాస్, రాజమౌళి అభిమానులు కోరుతున్నారు.