నిత్యా మీనన్ పేరు ఈ మధ్యన మీడియాలో పెద్దగా వినబడడం లేదు. కారణం ఏమిటంటే నిత్య తాజాగా ఎటువంటి సినిమాలను ఒప్పుకోకుండా ఉండడమే. అసలు మహానటి సావిత్రి చిత్రంలో నిత్యా మీనన్.. సావిత్రి పాత్రకి ఎంపికైందని.. అంతలోనే రిజెక్ట్ అయ్యిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె గురించి ఇప్పుడు కొత్త న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆమె సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం రెమ్యునరేషన్ కాదంట ఆమెకి డైరెక్షన్ మీదకి గాలి మళ్లడమేనట. అందుకే వచ్చిన అవకాశాలను నిత్యా వదులుకుంటుందని ఒకటే ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ విషయాన్ని ఓ స్టార్ డైరెక్టర్ కన్ఫర్మ్ చేస్తున్నాడు. తాను నిత్యా మీనన్ ని తన సినిమాలో హీరోయిన్ గా నటించమని అడగడానికి ఆమెని కలిసినప్పుడు... ఆమె ఎందుకు సినిమాలు ఒప్పుకోవడంలేదో చెప్పిందని.. కథనాలు వెలువడుతున్నాయి. డైరెక్టర్ గా తన కల సాకారం చేసుకోవడానికే నిత్యా ఇలా వచ్చిన ఆఫర్స్ అన్ని రిజెక్ట్ చేస్తుందని సదరు దర్శకుడు చెబుతున్నాడు. అయితే ఆ దర్శకుడు చెప్పినట్టు నిత్యా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టిందని సమాచారం.
అందులో భాగంగానే నిత్య ఇప్పటికే ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకుందని... ఆ స్క్రిప్టుతోనే త్వరలోనే తెలుగు, మలయాళంలో ఒక సినిమాకి శ్రీకారం చుట్టబోతుందని అంటున్నారు. అసలు నిత్యాకు ఇలా హీరోయిన్ అవతారం నుండి డైరెక్టర్ గా మారాలనే కోరిక ఎందుకు కలిగిందో తెలియదు కానీ.. హీరోయిన్ గా సక్సెస్ అయిన నిత్య డైరెక్టర్ గా కూడా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.