Advertisement
Google Ads BL

నాకేం సంబంధం లేదంటూ..రజినీ ట్విట్..!


తమిళనాట రాజకీయం రసవత్తవరంగా సాగుతుంది. నిన్నటిదాకా పన్నీర్ సెల్వం వర్గం, శశి వర్గం రెండాకులు గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్ వద్ద పోటీ పడ్డారు. ఆర్ కె నగర్ నియోజకవర్గంలో అమరన్, అన్నా డీఎంకె నేతలు మధుసూదనన్, దినకరన్, దీపా జయకుమార్ తో పోటీ పడుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ బిజెపి అభ్యర్థిగా పోటీపడుతున్న గంగై అమరన్ తనకు సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

మరి సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు అంటే మామూలు విషయం కాదు. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా? అని తమిళ ప్రజలు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఇవ్వడంలేదు. కానీ ఇప్పుడు బిజెపి అభ్యర్థిని మాత్రం బలపరుస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. అసలు ఈ ప్రచారానికి కారణం.... అమరన్, రజినీకాంత్ ని పర్సనల్ గా కలవడమే. అందుకే ఇంత హాట్ గా తమిళనాట ప్రచారం జరిగింది.  

అయితే రజినీ మాత్రం ఆర్ కె నగర్ నియోజకవర్గంలో నిలబడే అభ్యర్థులలో తానెవరికీ  మద్దతివ్వడంలేదని స్పష్టం చేశారు. నేను ఎవరికీ మద్దతివ్వడం లేదని రజినీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తాజాగా రజనీకాంత్ చేసిన ప్రకటనతో ఈ ఊహాగానాలకు తెర పడింది. ఇక ఆర్ కె నగర్ ఎలక్షన్స్ మాత్రం కాస్త రసవత్తరంగా మారినట్లే!!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs