Advertisement
Google Ads BL

కేశవ ట్రైలర్: హిట్టు కళ కొట్టొచ్చినట్టుంది!


హీరో నిఖిల్ విభిన్న కథా చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా వున్న కథలను ఎంచుకుంటూ హిట్ ట్రాక్ ఎక్కిన నిఖిల్ మరోసారి తాజాగా 'కేశవ' చిత్రంతో ప్రేక్షకులని పలకరించడానికి వచ్చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్ పగ ప్రతీకారంతో రగిలిపోయే పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే నిఖిల్ ఇంతకుముందెన్నడూ కనిపించని పాత్రలో ఈ చిత్రంలో  కనిపిస్తాడని 'కేశవ్' ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

ఈ ట్రైలర్ లో... 

'భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని,

వైప్లవ్యగీతాన్ని నేను!

స్మరిస్తే పద్యం,

అరిస్తే వాద్యం,

అనల వేదికముందు అస్రనైవేద్యం!'

అంటూ నిఖిల్ చెప్పే శ్రీ శ్రీ మహాప్రస్థానం డైలాగ్ ఓ రేంజ్‌లో పేలింది. ఈ ట్రైలర్ లో నిఖిల్ ని అలా చూస్తుంటే మళ్ళీ హిట్ కొట్టడం ఖాయంగా కనబడుతుంది. 'పెళ్లి చూపులు' హీరోయిన్ రీతూ వర్మ జర్నలిస్ట్ గా ఇందులో నటిస్తుంది. మరి ఫస్ట్ టీజర్ తోనే అందరిని ఆకట్టుకొంటున్న 'కేశవ' చిత్రం మే 12 న విడుదలకు సిద్ధమవుతోంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs