Advertisement
Google Ads BL

ఇంకా బాబు వ్యూహంతోనే పవన్ ముందుకెళ్తున్నాడా.?


జ‌న‌సేన అధినేత, పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రాబోవు ఎన్నికల నాటికి ఏపీలో కీల‌క రాజ‌కీయ శ‌క్తిగా అవ‌త‌రిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైకాపాను అడ్డుకునేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంకా బాబుకు సహకరిస్తున్నాడా? లేకా అలా సహకరిస్తూ.. జనసేనను బలమైన పార్టీగా అవతరింపజేసుకొనేందుకు బాబును పావుగా వాడుకుంటాన్నాడా? ఏంటి అనేది ఇరువురి మధ్య చాలా రహస్యపూరితమైన వాతావరణానికి సంబంధించిన విషయాలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి.  అది ఎంతవరకు అంటే రాబోవు ఎన్నికల నాటికి వీరిద్దరి బాగోతం తేలిపోతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాబోవు ఎన్నికలలో తెదేపాతో జనసేన జతకట్టే ఉద్దేశం ఏం లేదని తెలుస్తుంది. ఎందుచేత అంటే పవన్ ఎలాగూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వ్యవహరించేందుకు దిగుతానని ప్రకటించడంతో ఇక అలాంటి ఛాన్స్ లేదనే తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే, ప‌వ‌న్ ను మరో విధంగా బాబు ఉపయోగించుకొందామన్న ఉద్దేశంతో వ్యూహర‌చ‌న జ‌రుగుతోందా? అనే అనుమానాలు వస్తున్నాయి. అంటే తాజాగా జరిగిన కొన్ని విషయాలను బట్టి చూస్తే.... బాబుకు బాగా అనుకూలమైన కొన్ని శ‌క్తులు ప‌వ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి వంత‌పాడే మీడియా వ‌ర్గం పవన్ సమీపానికి వచ్చి పవన్ ను బుట్టలో వేసుకొనేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.  ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ విషయంలో గోడ మీద పిల్లిలా వ్యవహరించిన ఆ మీడియా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా చిలుక పలుకులు పలకడం అంటే అలాంటి అనుమానాలకే తావిస్తుంది.

అయితే సహజంగా ప్రస్తుతం ఉన్న రాజకీయాలను బట్టి ఏపీలో తెదేపాకు కొంత ప్రజా వ్య‌తిరేక‌త ఉన్న మాట వాస్తవమే అయితే దాన్ని పవన్ కళ్యాణ్ వేరు కుంపటి పెట్టినా ఆ పార్టీ ద్వారా తమకు అనుకూలంగా భర్తీ చేసుకొనేందుకు వీరంతా పాట్లు పడుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కాటమరాయుడు ఫ్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో అలాంటి మీడియా నుండి పవన్ భజన పరుల నుండి అలాంటి ధ్వనులే విన్నాం. అంతేగాకుండా  దాదాపు ఐదు పేజీల క‌వ‌ర్ స్టోరీతో కూడా ఓ ప్ర‌ముఖ మీడియా ఆదివారం అనుబంధంగా పవన్ భజన చేసింది. 

ఇదంతా చూడబోతే బాబు వ్యూహంలో భాగంగానే అని తెలుస్తుంది. మరో వైపు బాబు ఏపీలో కాపులంతా ఎటువైపు ఉన్నారన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ దానికి అనుగుణంగా అడుగులు కదుపుతున్నారు. అందులో భాగంగా పవన్ ఎటుపోయినా చివరికి తనవైపే ఉండే విధంగా అన్ని మార్గాలను సుగమం చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది.  ఏదైతేనేం తెదేపా వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా జగన్ వైపుకు మారకుండా చూసేందుకు కూడా బాబు వ్యాహాత్మకంగా పవన్ తోడును ఎప్పటికప్పుడు దూరం కాకుండా దగ్గర అయ్యేందుకు పాటుపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటివి అవలంభిస్తూ బాబు ఎప్పటికప్పుడు ఏపీ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు అర్థమౌతుంది. చూద్దాం ముందు ముందు బాబు, పవన్ లో కలుస్తాడా? లేకా పవన్ బాబులో కలుస్తాడా? అనేది. వీరి ఇరువురి ఏం చేసుకున్నా జగన్ కి చెక్ పట్టే ఏకైక లక్ష్యమేనన్నది బహిరంగ రహస్యం. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs