Advertisement
Google Ads BL

నాగ్ చెప్పినా..అమల ఒప్పుకోవడం లేదు..!

nagarjuna,amala,amala akkineni movies,life is beautiful | నాగ్ చెప్పినా..అమల ఒప్పుకోవడం లేదు..!

టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత నటనకు అక్కినేని అమల గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే... ఆ తర్వాత అమల బ్లూక్రాస్ యానిమల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ తో చాలా బిజీగా గడుపుతున్న విషయం విదితమే. కానీ చాలా కాలం తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల తన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ కోసం  అమలను అడగడంతో  ఆ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. అమల చాలా కాలం తర్వాత ఆ సినిమాలో నటించగా ఆ చిత్రం సరైన గుర్తింపు పొందక పోవడంతో.. ఇక టాలీవుడ్ సినిమాలపై ఆమె ఇంట్రెస్ట్ పెట్టలేదు.  

Advertisement
CJ Advs

ఆ తర్వాత బాలీవుడ్ కెళ్ళి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘హమారి అదూరీ కహానీ’  చిత్రంలో ఓ సపోర్టింగ్ రోల్ లో నటించింది. అయితే బాలీవుడ్ లో ఆ సినిమా  కూడా సక్సెస్ ను సాధించలేదు. దీంతో ఈ మధ్య అమల.. సైరా భాను అనే మలయాళం సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో ఇక తాను సినిమాలలో నటించనని తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. 

హీరో నాగార్జున ఎందుకు అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నావ్ అని వారించినప్పటికీ.. తాను ఆ నిర్ణయానికే కట్టుబటి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా అఖిల్ లవ్ ఫెయిల్ అవడం, వరుసగా తన సినిమాలు కూడా ప్లాప్ లు అవుతుండటంతో అప్ సెట్ అయిన అమల ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు. సో.. ఇక నుండి అమల. బ్లూక్రాస్ పనులలోనే చురుకుగా పాల్గొననుందన్న మాట. చూద్దాం ఈ నటీమణి అన్న మాటపై ఎంతమాత్రం కట్టుబడి ఉండగలదో?

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs