ఈ మధ్యన యూట్యూబ్ లో పెద్ద చిత్రాల టీజర్స్ మోత తెగ మోగిపోతుంది. వరుసగా పెద్ద హీరోల చిత్రాలు విడుదలకు సిద్ధమవడం... వాటి ఫస్ట్ లుక్ టీజర్స్ ని యూట్యూబ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చెయ్యడం... వాటికీ ఎన్ని లైక్స్ వచ్చాయి.... ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేదాని మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. ఇక ఆయా హీరోల ఫ్యాన్స్ అయితే పరోక్ష యూట్యూబ్ యుద్ధానికి దిగి డిజ్ లైక్స్ అనే సంస్కృతికి తెర లేపారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యూట్యూబ్ మీద హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. మా హీరో గొప్ప అంటే మా హీరోనే గొప్ప అని తన్నుకుచస్తున్నారు ఫ్యాన్స్.
కేవలం ఈ యూట్యూబ్ వ్యూస్ మాత్రమే హీరో స్టామినాని డిసైడ్ చేస్తున్నట్లు ఫీల్ అయిపోతున్నారు చాలామంది. ఇక తాజాగా ఈ రచ్చ 'కాటమరాయుడు' చిత్రానికి, 'డీజే' చిత్రానికి మధ్య మొదలైంది. ఈ రెండు చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి టీజర్స్ ని విడుదల చేశాయి. 'కాటమరాయుడు' ఫిబ్రవరి 4న ఫస్ట్ లుక్ టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చెయ్యగా అది కోటి 8 లక్షల వ్యూస్ సాధించి టాప్ ప్లేసులో కూర్చుంది. ఇక బన్నీ 'డీజే' చిత్రం ఫిబ్రవరి 23 న విడుదలై అత్యంత వేగంగా కోటి వ్యూస్ సాధించి 'కాటమరాయుడు'కి గట్టి పోటీనిచ్చింది .
బాహుబలి చిత్రాన్ని పక్కన పెడితే.. యూట్యూబ్ లో వ్యూస్ పరంగా కాటమరాయుడు టాప్ ప్లేస్ లో ఉంటే.... డీజే చిత్రం నెక్స్ట్ ప్లేస్ ని ఆక్రమించింది. ఇక ఖైదీ నెంబర్ 150 మూడో ప్లేస్ లో కొనసాగుతుంది.