ప్రస్తుతం యావత్ దేశం 'బాహుబలి- ది కన్‌క్లూజన్' కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ సర్వేలో కూడా బాలీవుడ్ ప్రేక్షకులు తమ సినిమాలను పక్కకు నెట్టి, 'బాహుబలి- ది కన్‌క్లూజన్' కోసం, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే అంశంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తేల్చి.. మోస్ట్ అవేటెడ్ మూవీగా 'బాహుబలి'ని మొదటిస్థానంలో కూర్చొబెట్టారు. కాగా 'బాహుబలి- ది బిగినింగ్' అనే ఓ దక్షిణాది చిత్రాన్ని, అందునా ఓ తెలుగు చిత్రం డబ్బింగ్ రైట్స్‌ని ఏకంగా బాలీవుడ్ దిగ్గజం కరణ్‌జోహార్ టేకప్ చేసినప్పుడు బాలీవుడ్ అంతా ఆశ్యర్యపోయింది. కరణ్‌జోహర్ ఆ చిత్రాన్ని ఎందుకు టేకప్ చేశారో? వారు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత అక్కడ సృష్టించిన ప్రభంజనం చూసిన తర్వాత అక్కడి మేకర్స్‌కి బాహుబలి సత్తా ఏమిటో తెలిసింది. 'బాహుబలి- ది బిగినింగ్'కు మొదట్లో భారీ థియేటర్లను కేటాయించకపోయిన ఎగ్జిబిటర్స్ ఈ చిత్రం సత్తా తెలుసుకుని థియేటర్లను హడావుడిగా పెంచేశారు.
సల్మాన్‌ఖాన్ వంటి స్టార్ కూడా మీడియాముందుకు వచ్చి మరీ ఈ చిత్రం యూనిట్‌ని వారెవా.. అని ప్రశంసించారు. ప్రస్తుతం పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా జక్కన్న దర్శకత్వంలో నటించానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ఈ చిత్రం సెకండ్ పార్ట్‌ను ఇప్పటి నుంచే తమ థియేటర్లలో విడుదల చేయడానికి ఎగ్జిబిటర్లు బారులు తీరుతున్నారు ఈ చిత్రం కోసం తమ థియేటర్లలో కోట్లలో ఖర్చుపెట్టి, 4కె టెక్నాలజీని సమకూర్చుకుంటున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్28న రిలీజ్ కానుందని కన్‌ఫర్మ్ కావడంతో ఏ బాలీవుడ్ నిర్మాత, స్టార్, డైరెక్టర్లు తమ చిత్రాలను ఆ రోజు విడుదల చేయకుండా 'బాహుబలి- ది కన్‌క్లూజన్' కి దారి ఇస్తున్నారు. కనీసం రెండు వారాలు గ్యాప్ తీసుకోవడానికి సిద్దమైపోతున్నారు.
ఇక ఈ చిత్రం మొదటి పార్ట్ ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్ర యూనిట్ సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయినా కూడా సంచలనం సృష్టించారు. భాషా సమస్య వల్లనో, మరి దేనివల్లనో కానీ, మొదటి పార్ట్ సందర్భంగా సరైన ప్రశ్నలకు అదే స్థాయిలో సమాధానం చెప్పలేకపోయారు. కానీ 'బాహుబలి- దికన్‌క్లూజన్' విషయానికి వచ్చేసరికి జక్కన్నతో పాటు ఈ చిత్రం యూనిట్ బాగా ముదిరిపోయారు. బాలీవుడ్‌లో ఈ చిత్రానికి ఎలా పబ్లిసిటీ చేయాలి? ఎలా ప్రమోషన్స్ చేయాలి? అక్కడి మీడియా అడిగే ప్రశ్నలకు ఎలాంటి సూటి సమాధానాలు చెప్పి కాంట్రవర్శీ సృష్టించాలో నేర్చుకున్నారు. ఇక జక్కన్న పలు బాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
ఈసందర్భంగా ఓ మీడియా ప్రతినిధి... మీ చిత్రం సెకండ్‌పార్ట్ టీజర్ షారుఖ్‌ఖాన్ నటించిన 'రాయిస్'ని మించిపోయింది. దీనిపై మీరు ఎలా ఫీలవుతున్నారు.? అని ప్రశ్నించాడు. దానికి మన జక్కన్న అదిరిపోయే పంచ్ వంటి సమాధానం ఇచ్చి, తనను, తన చిత్రాన్ని అక్కడ వార్తల్లో ఉంచాడు. ఇక దీనికి జక్కన్న సమాధానం ఇస్తూ, నాకు ఈ విషయం ముందే తెలుసు. నా చిత్రానికి ఆ దమ్ము ఉంది. ఓ తెలుగు చిత్రానికి ఆ సత్తా ఉంది. భవిష్యత్తు మొత్తం ఇక దక్షిణాదిదే అనే కరుకైన గడసరి సమాధానం చెప్పాడు. దీంతో ఆ ప్రశ్నను అడిగిన మీడియా ప్రతినిధితో పాటు ఆ సమాధానం విన్నవారు కూడా షాక్‌కు గురయ్యారు. ఇక ఈ సమాధానం చూసి అక్కడి ఇండస్ట్రీ మొత్తం షాక్‌కి గురైంది. మొత్తానికి జక్కన్న వివాదాలతో సహవాసం చేయడం ఎలా, ఎవరికి ఎలాంటి సమాధానాలు ఇచ్చి తన చిత్రాన్ని వార్తల్లో ఉంచాలి? అనే కిటుకును చాలా త్వరలో నేర్చుకుని అక్కడి మీడియాకు షాక్ ఇచ్చేశాడు. దట్ ఈజ్ జక్కన్న.. కీపిట్ అప్.. వుయ్ ఆర్ ప్రౌడ్ దట్ యుఆర్ ఎ తెలుగు మేకర్.. జై బాహుబాలి.. సహోరే.. బాహుబలి....!