లైంగిక వేధింపులు: కాజల్ కూడా ఒప్పేసుకుంది!


ఈ మధ్యన టాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొంతమంది హీరోయిన్స్ పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. తాము సినిమాల్లో నటించేటప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యామంటే .... మరికొంతమంది ఇక్కడ నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా సినీ ప్రముఖుల లైంగిక వాంఛలు తీర్చాల్సిందే అని మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు టాలీవుడ్  టాప్ హీరోయిన్ రకుల్ కూడా వత్తాసు పలికింది. ఇలాంటివి టాలీవుడ్ లో జరుగుతున్నాయని... తాను విన్నానని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అయితే ఈ లైంగిక వేధింపులు మాత్రం తనకి ఎదురవలేదని... కానీ ఇండస్ట్రీలో ఎదగాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్నిట్టికి రాజీ పడాల్సి వచ్చిందని చెబుతుంది. తాను కెరీర్ మొదలు పెట్టినప్పుడు కొన్ని అభ్యంతర సన్నివేశాల్లో, మితిమీరిన ఎక్స్ పోజింగ్ చెయ్యాలి వచ్చిందని.. అప్పుడు తాను మానసికంగా కుంగిపోయానని చెబుతుంది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదని... ఇలాంటివి ఖచ్చితంగా చెయ్యాల్సి వస్తుందని... అందుకే కెరీర్ తొలినాళ్లలో అలాంటి తప్పు చెయ్యాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

అయితే కొంచెం నిలదొక్కుకున్నాక మళ్ళీ అలా చెయ్యలేదని... అయినా అలాంటివి చేస్తూ పోతూ కెరీర్ నాశనమవుతుందని భావించి రూట్ మార్చుకుని.... మంచి కథ ఉన్న సినిమాలు చేస్తూ జాగ్రత్త పడ్డానని, అందుకే ఎక్కువ ఎక్స్ పోజింగ్ లేకుండా ఉన్న పాత్రలే ఎంచుకుంటూ మంచి పొజిషన్ లో ఉండగలిగానని చెబుతుంది. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES