Advertisement
Google Ads BL

'బాహుబలి' తర్వాత ప్రభాస్ పరిస్థితేంటి?


ప్రస్తుతం ఇండియా మొత్తం మీద 'బాహుబలి' హవా నడుస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు ముఖ్యమైన భాషలన్నింటిలో ఈ చిత్రం ఆయా భాషల్లో అనువాదమై విడుదల కానుంది. ఈచిత్రం మొదటి పార్ట్‌ సాధించిన సంచలన విజయం నేపథ్యంలో సెకండ్‌పార్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి ఈ చిత్రం ట్రైలర్ సృష్టిస్తున్న రికార్డులే ఉదాహరణ. కాగా యంగ్‌రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌కు ఈ చిత్రం దేశవిదేశాల్లో గుర్తింపును తీసుకొచ్చింది. ఇక బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌లలో కూడా ప్రభాస్‌ మేనియా మొదలైంది. ఇక టాలీవుడ్‌ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. దీంతో వర్మ వంటి దర్శకుడు కూడా ప్రభాస్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. మన టాలీవుడ్‌ స్టార్స్‌ గతంలో నేషనల్‌స్టార్స్‌గా నిలబడాలని ప్రయత్నించి రీజనల్‌ స్థాయికి పడిపోయారని, ప్రభాస్‌ మాత్రం రెండే రెండు చిత్రాలతో నేషనల్‌స్టార్‌ అయిపోయాడని ఆయన కితాబునిచ్చారు. 

Advertisement
CJ Advs

కాగా ప్రస్తుతం తెలుగులో 'బాహుబలి', 'నాన్‌ బాహుబలి' అనే పదం బాగా పాపులర్‌ అయింది. ప్రతిస్టార్‌ తమ చిత్రాలను 'బాహుబలి'తో పోల్చవద్దని, అదొక స్పెషల్‌ మూవీ అని చెబుతున్నారు. దాదాపు ప్రతిస్టార్‌ హీరో, నిర్మాత, దర్శకుల నుంచి కూడా ఇదే పదాలు వెలువడుతున్నాయి. కాగా 'బాహుబలి' కథ రీత్యా, జక్కన్న దర్శకత్వం, ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడి తదితర అంశాల దృష్ట్యా అది ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకోవాల్సిందే. ఇక ఈ 'బాహుబలి' రెండుపార్ట్‌ల తర్వాత ఉత్తరాది ప్రేక్షకులు ప్రభాస్‌ని ఏ రకంగా గుర్తిస్తారో? ఎలాంటి హిట్స్‌ని ఇస్తారో అని సినీ విశ్లేషకులు, విమర్శకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తన తదుపరి చిత్రాలను కూడా ప్రభాస్‌ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలను కూడా టార్గెట్‌ చేసి తన దృష్టిని, తన మార్కెట్‌ను ఇతర భాషల్లో కూడా సుస్థిరం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సుజీత్‌ మూవీ దానికి ఉదాహరణ. 

బాహుబలి తర్వాత కూడా ప్రభాస్‌ ఇదే స్థాయి ఇమేజ్‌ను బాలీవుడ్‌లో తెచ్చుకోగలిగితే ఆయనను ఖచ్చితంగా ఆకాశానికి ఎత్తి, ప్రతి తెలుగువాడు గర్వపడతారు. మరి బాహుబలి తర్వాతి చిత్రాలతో, జక్కన్న కాకుండా ఇతర దర్శకులతో మామూలు కమర్షియల్‌చిత్రాలతో కూడా ప్రభాస్ ఇదే విధంగా తన హవా దేశవ్యాప్తంగా సాధించగలడా? లేదా? అనేది చూడాల్సివుంది. ప్రభాస్‌కి బాలీవుడ్‌ హీరోలకు కావాల్సిన అన్ని అర్హతలున్నాయి. కానీ ఇక్కడ మనం కమల్‌హాసన్‌ గురించి కూడా చెప్పుకోవాలి. తెలుగులో సంచలన విజయం సాధించిన 'మరో చరిత్ర'ను హిందీలోకి రీమేక్‌ చేస్తూ 'ఏక్‌దూజే కేలియే' ద్వారా కమల్‌ బాలీవుడ్‌లో సంచలన విజయం సాదించి, రాత్రికి రాత్రి లవర్‌బోయ్‌ ఇమేజ్‌తో యువతను ఉర్రూతలూపాడు. కానీ తన తర్వాతి చిత్రాలతో అదే మ్యాజిక్‌ని కొనసాగించలేకపోయాడు. మరి ప్రభాస్‌ బాహుబలి తర్వాత ఎలా అక్కడ కూడా నెగ్గుకొస్తాడో వేచిచూడాల్సివుంది...! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs