Advertisement
Google Ads BL

ఇళయరాజా నోటీసులపై బాలు స్పందన.!


ఇళయరాజా కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చెప్పాలి. ఎలా అంటే..  ఇళయరాజా సంగీత దర్శకత్వంలో కొన్ని వందల పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ మధ్య బాలసుబ్రహ్మణ్యానికి ఇళయరాజా లీగల్ నోటీసులివ్వడంపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుది. ఇళయా రాజా తన పాటలకు సంబంధించి రాయల్టీ కోరుకోవడంలో అతని తప్పేం లేకపోయినప్పటికీ మాట్లాడితేల్చుకోవాల్సిన అంశాలను లీగల్ నోటీసుల ద్వారా కోర్టులకెక్కడం అంత మంచి గౌరవప్రదం కాదన్నది అందరి వాదన.  ఇది ఇలా ఉండగా ఇళయరాజా నోటీసులపై బాల సుబ్రహ్మణ్యం స్పందించాడు. ఈ లీగల్ నోటీసు వివాదంపై తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో బాలసుబ్రహ్మణ్యం చాలా హుందాగా స్పందించాడు. 

Advertisement
CJ Advs

బాల సుబ్రహ్మణ్యం ఏమని స్పందించారంటే... ‘ఇళయరాజా గారితో నేరుగా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా నా మిత్రులు సలహా ఇస్తున్నారు. కానీ ఆయన నాతో నేరుగా మాట్లాడటం, కనీసం మెయిల్  అన్నా పంపించడం వంటివి చేసి ఉంటే నేను  కూడా అందుకు అనుగుణంగా ఆయనతో మాట్లాడి ఆ రకంగా ముందుకు నడిచే వాళ్ళం. ప్రస్తుతం ఆయన నాకు లీగల్ నోటీసు పంపారు కాబట్టి ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా చట్టబద్ధంగానే చేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. నాకు కూడా ఆత్మ గౌరవం ఉంది కాబట్టి ఈ చర్చను దీంతో ముగించి ముందుకెళ్దాం. కానీ వాస్తవంగా జనాలకు ముందు ఈ విషయాలను చెప్పాలి కాబట్టి ఈ సమాచారాన్ని తెలియజేస్తన్నాం. ఈ విషయంతో నా మంచి మిత్రుడైన ఇళయ రాజాకు అసౌకర్యం కలిగించాలని నేను కోరుకోవడం లేదు. అదే విధంగా నా స్పాన్సర్లు.. ఆర్గనైజర్లు కూడా మానసికంగానూ, ఆర్థికంగానూ నష్టపోకూడదని కోరుకుంటున్నాను’ అని బాలసుబ్రహ్మణ్యం స్పందించాడు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs