Advertisement
Google Ads BL

జక్కన్నా.. నీ ప్లాన్ సూపరన్న..!


'బాహుబలి- ది బిగినింగ్‌' విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఈ చిత్రం సాధించిన విజయం ఆషామాషీ కాదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనేది ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తోన్న ఆసక్తికర విషయం. ఇక ఈ చిత్రం సెకండ్‌పార్ట్‌గా 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం ఏప్రిల్‌ 28న విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ సృష్టిస్తున్న సంచలనం అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం విషయంలో ఇప్పటికే తన మార్కెటింగ్‌ స్ట్రాటర్జీని అనుసరించిన రాజమౌళి తాజాగా మరో కీలకనిర్ణయం తీసుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం మొదటిపార్ట్‌ను సరిగా గుర్తుంచుకోలేక కొందరు తికమకపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఉన్న కన్‌ఫ్యూజన్‌కి తెరతీస్తూ, బాహుబలి-ది కన్‌క్లూజన్‌ చిత్ర విడుదలకు రెండు వారాల ముందు ఈ చిత్రం మొదటి పార్ట్‌ను మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నాడు. దీనిద్వారా మరింత లాభాలు వచ్చే అవకాశంతోపాటు ఫస్ట్‌పార్ట్‌ చూడని వారికి, సెకండ్‌పార్ట్‌ చూడాలనుకునే వారికి ఇది ఓ తీపికబురే అని చెప్పవచ్చు. కానీ జక్కన్న మాత్రం ఈ పనిని తాను వ్యాపారపరంగా క్యాష్‌ చేసుకోవాలని ప్రయత్నించడం లేదని వివరణ ఇచ్చాడు. కానీ ఇది మార్కెటింగ్‌లో ఓ నిర్ణయమని, దీని ద్వారా కూడా లాభాలే వస్తాయన్న విషయాన్ని చెప్పడానికి జక్కన్న ఎందుకు సందేహిస్తున్నాడో అర్ధం కావడం లేదు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs