Advertisement
Google Ads BL

పవన్ తనకు దేవుడన్న బండ్ల.!


ఓ సాధారణ వ్యక్తి అంచలంచలుగా కాదనుకో.. నటుడిగా ఉంటూ నిర్మాతగా మారిపోయి సంచలనాత్మక చిత్రాలను నిర్మించిన నిర్మాత బండ్ల గణేష్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బండ్ల వీరాభిమాని. తాజాగా బండ్ల గణేష్ కాటమరాయుడు చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. పవన్ పై తన వీరాభిమానాన్ని చాటాడు. బండ్ల, పవన్ ను ఎప్పుడూ పొగడ్తలతో ముంచెత్తి అలా ప్రసన్నం చేసుకోవాలనుకుంటాడు గానీ.. ఈ సారి మాత్రం బండ్ల మాటల్లో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. అసలు పవన్ లో అనేకమంది వీర స్వాతంత్ర్య సమరయోథులు దర్శనమిస్తున్నారని చెప్పేశాడు. 

Advertisement
CJ Advs

మొదట ఎత్తుకోవడంలోనే టీవీ9 రవి ప్రకాష్ అంటే తనకు ఇష్టమని, ఎందుకంటే అతనిలో తన బాస్ లక్షణాలు అనువణువునా ఉన్నాయంటూ మొదలెట్టి... ఏం మాట్లాడమంటారు బాస్ గురించి? ఏం చెప్పమంటారు? అంటుండగా ఒక్కసారిగా ఆడియన్స్ అంతా సి.ఎం.. సి.ఎం అని అరవడంతో .. ఆయన ఏమవుతారో కాలమే నిర్ణయిస్తుంది అంటూ అసలు విషయాలలన్నీ మొదలెట్టాడు.

ఇక బండ్ల గణేష్ పవన్ గురించి మాట్లాడుతూ.. ‘ఏమ్ చెప్పమంటారు నా దేవుడు గురించి? కళ కళ కోసం కాదు ప్రజల కోసం అన్న కవి బళ్ళారి రాఘవ పవన్ అని చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతా అన్న బాలగంగాధర తిలక్ ఆయన అని చెప్పమంటారా? కులం పునాథులపై ఒక జాతిని ఒక నీతిని నిర్మించలేం అన్న అంబేద్కరే పవన్ కళ్యాణ్ అని చెప్పమంటారా? భారత దేశానికి హిందూ ముస్లింలు రెండు కళ్ళు అన్నాడు అహ్మద్ ఖాన్ వంటి ఆయన పవన్ అని చెప్పమంటారా? చిరిగిన చొక్కా అయినా  తొడుక్కో కాని ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం పంతులే ఆయన అని చెప్పమంటావా? ఆర్య సమాజం నా తల్లి, వైదికులం నా తండ్రి.. అన్న లాలాలజపతి రాయ్ పవన్ అని చెప్పమంటారా? వీర సైనికుడిగా మరణించడం మేలు అన్న  టిప్పు సుల్తాన్  పవన్ అని చెప్పమంటారా? బెంగాల్ విభజనే బ్రిటీష్ పతనానికి నాంది అన్న  మహాత్మ గాంధి ఆయన అని చెప్పమంటారా? నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యం తెచ్చిస్తా అన్న సుభాష్ చంద్రబోసే ఆయన అని చెప్పమంటారా? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగే పవన్ కళ్యాణ్ గా మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు’ అంటూ వీర సమరయోధులైన మహానుభావులంతా కలగలిసి పవన్ కళ్యాణ్ లో దర్శనమిస్తుంటారు అంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ వెల్లడించాడు. చివరగా బండ్ల గణేష్  చెప్తూ.. ‘మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్’  అంటూ ట్విస్ట్ ఇచ్చి మరీ క్లోజ్ చేసేశాడు బండ్ల గణేష్. మొత్తానికి పవన్ ను భలే పొగిడేశాడు బండ్ల గణేష్.   

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs