హేమ ఫైర్ అయ్యింది అందుకేనా..?


నటి హేమ అంటే అందరికి పరిచయమున్నపేరే. ఆమె సినిమాల్లోనే కాదు బయట కూడా అంతే జోష్ లో ఉంటుంది. ఎప్పుడూ సరదాగా ఉండే హేమ ఇండస్ట్రీలోని కొంతమంది గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పడు ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో జరిగే లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా సోషల్ మీడియా సాక్షిగా పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఉండాలంటే కొంతమంది లైంగిక వాంఛలు తీర్చాలని లేకపోతె ఇక్కడ నెట్టుకురావడం కష్టమని పాత హీరోయిన్స్ దగ్గర నుండి ఈ మధ్యన హైలెట్ అయిన హీరోయిన్స్ వరకు ‘కేస్టింగ్‌ కౌచ్‌’ గురించి మాట్లాడుతూ మీడియాకెక్కుతున్నారు. 

ఆ వ్యాఖ్యలకు స్పందించిన హేమ ఆ హీరోయిన్స్ ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని వారు తాము నటించిన ఆ గత చిత్రాల పేర్లు చెప్పుకునే ఇంకా మనుగడ సాగిస్తున్నారని...ఇప్పుడేదో అవకాశాలు రాకపోవడంతో ఇలా నీచమైన మాటలు మాట్లాడుతున్నారని... అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ మరీ ఇంత నీచంగా ఉంటే టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్స్ తమ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యడానికి ఎందుకు తీసుకొస్తారని ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా వెబ్సైట్ వచ్చాక చాలా అనర్ధాలు జరుగుతున్నాయని.. మీడియా కూడా కొన్ని విషయాల్ని భూతద్దంలో చూపిస్తూ రచ్చ చేస్తుందని ఆరోపణలు గుప్పిస్తుంది.

అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై కూడా హేమ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. పూరి ఎప్పుడు పరభాషా నటుల వెంటే పడతాడని.... ఆయనకి తెలుగు నటీనటులు నచ్చరని.... తెలుగు పరిశ్రమలో తెలుగు వాళ్ళకి స్థానం లేదని... బయటి వాళ్ళకి మాత్రమే పూరి అవకాశాలిస్తాడని డైరెక్ట్ గా పూరీని కడిగిపడేసింది. అసలు పూరి నాకెందుకు అమ్మ కేరెక్టర్స్ ఇవ్వడు?... ఎన్టీఆర్ కి నేను తల్లిగా నటించడానికి పనికిరానా? అని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తనకి ఈ ఇండస్ట్రీతో 25  ఏళ్ళ అనుబంధం ఉందని తనకి ఏదైనా మాట్లాడే అర్హత ఉందని అంటుంది.

అసలు హేమకి ఇంతగా పూరి పై కోపం ఎందుకొచ్చిందని అప్పుడే కొంతమంది కారణాలువెతికే పనిలో పడ్డారు. అసలు పూరి పై ఇప్పుడు హేమ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడానికి కారణం బాలకృష్ణ - పూరి కాంబినేషన లో తెరకెక్కే చిత్రంలో హేమ కి ఏదో ఒక కేరెక్టర్ ఇవ్వకపోవడమే అని అంటున్నారు,. హేమకి బాలకృష్ణ అంటే పిచ్చి అని అందుకే అయన సినిమాలో తనకి ఏ కేరెక్టర్ దక్కకపోయేసరికి ఆ అక్కసుతోనే ఇలాంటి అభాండాలు వేస్తుందని అంటున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES