అల్లుఅరవింద్.. ది మాస్టర్‌బ్రెయిన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఆయన తన పెద్ద కుమారుడు అల్లుఅర్జున్ కెరీర్‌ను చిరు బాటలో నడిపించి, మెగాఫ్యామిలీ హీరోగా మెగాభిమానులను తన కొడుకు కెరీర్‌కు అద్భుతంగా వాడుకొని స్టార్‌హీరోగా నిలబెట్టాడు. ఇక ఇప్పుడు స్టార్‌గా ఓ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయన తన కొడుకుతో కలిసి ఓన్ మార్కెట్, ఓన్ ఇండివిడ్యూవల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పవన్ అభిమానులను కూడా స్లైలిష్‌స్టార్ చులకనగా మాట్లాడి, ఇప్పుడు వారి టార్గెట్‌ను ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఇక మరోవైపు అల్లుఅరవింద్..అల్లుశిరీష్‌ను కూడా హీరోని చేశాడు. 'గౌరవం'తో ఇతను నటునిగా తేలిపోయాడు. ఎన్నోస్కెచ్‌లు వేసి మారుతి దర్శకత్వంలో తీసిన 'కొత్తజంట' కూడా అదే బాట పట్టింది. కానీ ఇటీవల వచ్చిన 'శ్రీరస్తు.. శుభమస్తు' చిత్రం ఫర్వాలేదనిపించింది. రొటీన్‌కథే అయినా ఈ చిత్రాన్ని కుటుంబప్రేక్షకులు మెచ్చేలా తీయడంలో దర్శకుడు పరుశురామ్ సక్సెస్ అయ్యాడు. కానీ అల్లు శిరీష్ వంటి నటునికి హీరోగా మొదటి విజయం ఇచ్చిన దర్శకుడు పరుశురామ్‌కి ఈ విజయం పెద్దగా కౌంట్‌లోకి రాకుండా అల్లుశిరీష్ ఖాతాలోకి వెళ్లిపోయింది.
ఇక హీరో పర్సనాలీటీ లేని నటులు కూడా ఎన్నో భాషల్లో విజయాలు సాధించిన, సాధిస్తున్న వారు ఉన్నారు. తాజాగా విజయ్‌ఆంటోని, జి.వి.ప్రకాష్ వంటి తమిళ హీరోలు ఇదే విషయాన్ని ఫాలో అవుతూ వైవిధ్యభరితమైన కథాంశాల ద్వారా ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. దీంతో అల్లు అరవింద్ కూడా శిరీష్‌కు ఇదే పంథా అనుసరిస్తున్నాడు. మల్లిడివేణు అనే దర్శకునితో 700ఏళ్ల కాలం నాటి ఓ కథను తీయాలని ట్రై చేశాడు. ప్రస్తుతానికి దాన్ని హోల్డ్‌లో ఉంచాడు. మోహన్‌లాల్ నటిస్తున్న '1971' ( బియాండ్ ది బోర్డర్స్) అనే యుద్ద నేపథ్యకథతో రూపొందుతున్న మలయాళ మూవీలో శిరీష్ ఓ కీలకపాత్ర చేశాడు. ఇక ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువాదం కానుంది. ఇక 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి నిఖిల్‌తో చేసిన చిత్రం ద్వారా రికార్డులు క్రియేట్ చేసిన ఇన్నోవేటివ్ డైరెక్టర్ ఐవి ఆనంద్‌ను పట్టుకున్నారు. ఆయనతో ఓ సైన్స్‌ఫిక్షన్‌ను అల్లు శిరీష్ హీరోగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సీరత్‌కపూర్, సురభి అనే హాట్ గుమ్మలను హీరోయిన్లుగా తీసుకున్నారు. మరి అల్లు వారి ఎత్తుగడ ఫలించేనా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.