లైంగిక వేధింపులపై రకుల్ సమాధానం..!


టాలీవుడ్ లో రెండు మూడు చిత్రాల్లో నటించిన హీరోయిన్స్ కొంతమంది ఈ మధ్యన తమపై లైంగిక వేధింపులు జరిగాయని బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైనప్పుడు నోరు మెదపని ఈ హీరోయిన్స్ ఇప్పుడు మాత్రం మీడియా సాక్షిగా ఇలాంటి విమర్శలకు తెరతీశారు. రెండు మూడు చిత్రాల్లో నటించిన హీరోయిన్స్ మాత్రమే లైంగిక వేధింపులకు గురైయ్యారా? మిగతా టాప్ హీరోయిన్స్ కి ఇలాంటి సమస్యలు ఎదురవలేదా? అని చాలామంది బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు. మరి ఇలా లైంగిక వేధింపులకు గురైతే గనక ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పాటు మనుగడ ఏ హీరోయిన్ కూడా సాధించలేరు. అంటే ఈ బడా హీరోయిన్స్ కూడా ఒకానొక సమయంలో వేధింపులకు గురైయ్యారా? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయి.

ఈ ప్రశ్నలకు ప్రస్తుతం టాలీవుడ్ లో బడా ఆఫర్స్ తో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఏం చెప్పిందో మీరే చూడండి. ఒక హీరోయిన్ వరుస ఛాన్సులతో దూసుకుపోతూ అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా అవతారమెత్తాలంటే ఆమె ఖచ్చితంగా  దర్శకుడు, ప్రొడ్యూసర్స్ తో క్లోజ్ గా ఉండడంతోనే సాధ్యపడుతుందని ఇక్కడ అందరూ చెప్పుకునేది నిజమేనా అని రకుల్ ని ప్రశ్నించగా... దానికి రకుల్ షాకింగ్ సమాధానం చెప్పింది. మీరు చెప్పింది నిజమే... కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి లైంగిక వేధింపులు జరుగుతాయని.... తాను విన్నానని చెప్పి విస్మయపరిచింది. ఏదైనా కెరీర్ టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుందని... లేకపోతె సినిమా ఇండస్ట్రీలో మనుగడ సాగించడం కష్టమని తేల్చేసింది.  అయితే రకుల్ ప్రీత్ ఇలాంటి సంఘటనలు విన్నాను తప్ప ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదురవలేదని స్పష్టం చేసింది.

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES