అసలు ఒక సినిమాతో మరో సినిమాను, ఒక స్టార్‌తో మరో స్టార్‌ని పోల్చడం తప్పవుతుంది. పోనీ ఒకే జోనరు చిత్రాలైతే అది కొంతవరకు సమంజసంగా ఉంటుంది. కానీ పూర్తి విరుద్దమైన రెండు చిత్రాల మద్య, ఇద్దరు హీరోల మధ్య, ఇద్దరు దర్శకుల మద్య పోలికలు పెట్టడం సమంజసం కాదు. ఇక చిరు నటించిన 'ఖైదీనెంబర్150' చిత్రం, బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు ఒకే సమయంలో రిలీజ్ కావడం వల్ల కాస్త పోలికలు కొందరుతెచ్చి ఉండవచ్చు. కానీ కలెక్షన్ల పరంగా కొందరు చూస్తే, సినిమాలోకి కంటెంట్, వైవిధ్యపరంగా మరికొందరు పోల్చుతూ విశ్లేషణలు చేసి ఉండవచ్చు. ఇక 'బాహుబలి' చిత్రాన్ని మొదటి నుంచి మన ఇండస్ట్రీ మొత్తం ప్రత్యేకంగా చూస్తూనే వచ్చింది. బడ్జెట్‌పరంగా, జోనర్ పరంగా, దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్.. అలాగే పలుభాషల్లో విడుదల కావడం వల్ల మన వారు 'బాహుబలి' వర్సెన్ నాన్‌బాహుబలి అనే పదాలను వాడారు. ఇక తమిళంలో అజిత్, విజయ్‌లను కమల్, రజనీలతో కంపేర్ చేయలేం. ఎందుకంటే కమల్, రజనీ వంటి వారు బాహుభాషల్లో గుర్తింపు ఉన్న వారు. కానీ అజిత్, విజయ్‌లు కేవలం పవన్‌లాగా ఒకే భాషకు పరిమితమైన హీరోలు. ఇక టీజర్ వ్యూస్, లైక్స్ విషయంలో కూడా 'బాహుబలి2'ని ప్రపంచవ్యాప్తంగా తిలకిస్తే, తమిళ 'వీరం' కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం కాబట్టి, ఒకే భాషకు పరిమితైన సినిమా కాబట్టి 'కాటమరాయుడు'ను 'బాహుబలి2' వ్యూస్ విషయంలో కూడా పోల్చలేం. ఇక నుంచి వ్యూస్‌లో కూడా 'బాహుబలి' నాన్ 'బాహుబలి' అనే తేడా రావడం ఖాయం. ఇక బడ్జెట్‌పరంగానే కాదు.. నిజాయితీగా చెప్పాలంటే ఈ రెండు చిత్రాలను ఏ విషయంలో కూడా పోల్చడం అనేది అసలు సమంజసమే కాదని చెప్పవచ్చు.