ఇప్పుడెక్కడ విన్నా బాహుబలి గురించే చర్చ. ఎందుకంటే బాహుబలి మ్యానియాతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇండియా మొత్తం ఊగిపోతున్నారు. అందుకే బాహుబలి ట్రయిలర్ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించింది. ఈ రోజు ఉదయమే థియేటర్స్ లో బాహుబలి ద కంక్లూజన్ ట్రయిలర్ ని విడుదల చేశారు రాజమౌళి టీమ్. ఇక ఈ ట్రయిలర్ ని ఈ రోజు సాయంత్రం యూట్యూబ్ లో విడుదల చేద్దామనుకున్న రాజమౌళికి షాక్ ఇచ్చేలా సామజిక మాధ్యమాల్లో బాహుబలి ట్రైలర్ చక్కర్లు కొడుతోంది. ఇక చేసేది లేక రాజమౌళి సాయంత్రం దాకా ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేయకూడదని అనుకున్నా.. వెంటనే బాహుబలి ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేయక తప్పలేదు. ఈ ట్రయిలర్ యూట్యూబ్ లో విడుదలైన ఏడు, ఎనిమిది గంటల్లోనే కోటి వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ బాహుబలి ట్రైలర్ కేవలం ఒక్క తెలుగు భాషలోనే కోటి వ్యూస్ సాధించి రికార్డు సృష్టించి తనకి ఏ తెలుగు సినిమా సాటిరాదని నిరూపించింది. ఈ బాహుబలి ట్రైలర్ లో భల్లాల దేవునికి, బాహుబలికి, శివునికి మధ్యన యాక్షన్ సీన్స్.... రాజమాతకి అమరేంద్ర బాహుబలికి, కట్టప్పకి మధ్యన ఎమోషనల్ డ్రామా.... ప్రభాస్, అనుష్క మధ్యన రొమాంటిక్ సన్నివేశాలకు కొదవ లేకుండా చూపించిన రాజమౌళి చివరిలో శివుడికి భల్లాల దేవునికి మధ్యలో కోపోద్రిక సన్నివేశంతో బాహుబలి ట్రైలర్ ని ఎండ్ చేసాడు రాజమౌళి. ఇక అలా ప్రభాస్ ని, రానా ని చూస్తుంటే వావ్ అనిపించక మానదు. అందుకే ఈ ట్రైలర్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారన్నది వాస్తవం.
ఇక యూట్యూబ్లో ప్రభంజనం సృష్టిస్తున్న ఈ బాహుబలి చిత్రం ఆడియో వేడుక ఈ నెల 25 న జరిపి, ఏప్రిల్ 28 న సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.