చంద్రబాబుతో పాటు టిడిపి నాయకులు ఎక్కువగా పారదర్శకత అనే పదాన్ని వాడుతుంటారు. తమపై మచ్చలు లేవని కబుర్లు చెబుతుంటారు. ఇక ప్రతిపక్ష వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై అక్రమ సంపాదన మాట్లాడుతుంటారు. అయితే జగన్ సంపాదించింది నిజమేనని, తన తండ్రి సీఎంగా ఉన్న సమయంలో జగన్ అక్రమాస్తులు కూడగట్టారని ఎక్కువ శాతం ప్రజలు భావిస్తున్నారు. అదే సమయంలో ఏ నాయకుడు అవినీతి చేయడం లేదు?.. అని నిర్లిప్తంగా ఉన్నారు. మరోపక్క న్యాయస్థానాలు తమ పని తాము చేసుకుపోతుంటాయనే భావనలో మరికొందరు ఉన్నారు. జయలలిత అక్రమాస్తుల విషయంలో సుప్రీం కోర్టు దానిని నిజమేనని చెప్పి, జయ మరణించడంతో ఏ2గా ఉన్న శశికళకు జైలు శిక్ష విధించింది. ఇది కేవలం 100కోట్ల లోపు కుంభకోణమే. జయ మొదటి సారి తన వద్ద పదిపైసలు ఆస్తిలేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొని, ముఖ్యమంత్రిగా రూపాయి జీతం తీసుకోననని చెప్పింది. అదే సమయంలో తదుపరి ఎన్నికల్లో తన ఆస్థిని బాగానే చూపించింది. మరి ముఖ్యమంత్రి కాకముందు ఏ ఆస్తులు లేవని, జీతం తీసుకోనని చెప్పిన జయ అతితక్కువ కాలంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో అఫిడవిట్‌లో ఆస్తులను బాగా ఉన్నట్లు చూపించడంతో అది సుబ్రహ్మణ్యస్వామికి ఆయుధంగా లభించింది.
ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆస్తుల విషయంలో కూడా అదే జరిగింది. ఐదునెలల కిందట తన ఆస్థిని 14.5కోట్లుగా చెప్పిన లోకేష్ తాజాగా తన ఆస్తిని దాదాపు 330 కోట్లుగా చూపించాడు. దీనిపై వైసీపీ పెద్దగా ఆందోళన చేయడం లేదు. ఎందుకంటే తమ నాయకుడు కూడా దొంగేనని, ఎదుటి వారిని ఈ విషయంలో విమర్శిస్తే అది తమ మెడకే చుట్టుకుంటుందని భయం. ఇక మీడియా కూడా దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ నేషనల్ మీడియాలో మాత్రం లోకేష్ ఆస్తులపై విచారణ కోరుతూ ఎన్నో వ్యాసాలు వస్తున్నాయి. తాజాగా ఒకప్పటి నటి, నేటి కాంగ్రెస్ పార్టీలోని నగ్మా కూడా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొంది. ఇది ఎన్డీయే పాలనకు అద్దం పడుతోందని, నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు రోడ్లపై పడుతూ, ఆకలికి అలమటిస్తూ, ఏటీఎంలు, బ్యాంకుల్లో నగదు లేక ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రాణాలు, ఉద్యోగాలు కోల్పోతుంటే... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లోకేష్ వంటి సామాన్యులు అసామాన్యులుగా ఎలా మారగలిగారు? మీడియా ముందు డొంకతిరుగుడుగా మాట్లాడటం, మరి జగన్ పరిస్థితి ఏమిటి? ఆయనకు అవినీతిపై మాట్లాడే అర్హత లేదని తప్పించుకోవడం కాదు. మరి సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారు మన రాష్ట్రంలో లేరని, సామాన్యులు తమ కడుపు నింపుకోవడం కోసం నానా బాధలు పడుతుంటే.. ఇలాంటివి ఆలోచించే సమయం, ఆసక్తి వారికి ఎక్కడ ఉంటుంది? కాబట్టి మన ప్రాంతీయ మీడియాలా భయపడకుండా నేషనల్ మీడియా దీనిని నిలదీసి.. సవివరమైన వాస్తవాలు ప్రజల ముందు ఉంచకపోతే ఎలా? ఇది ఎలాంటి పారదర్శకత? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా...!