అల్లు రామలింగయ్య పేరుమీద ఏటా జరిగే అవార్డు ప్రదానోత్సవం హైదరాబాద్ లో ఘనం గా నిర్వహిస్తున్నారు అల్లు కుటుంబం సభ్యులు. ఈ ఏడాది కూడా ఈ అల్లు రామలింగయ్య అవార్డుని దాసరి నారాయణ రావు కి ప్రధానం చెయ్యాలని అల్లు ఫ్యామిలీ అనుకుంది. కానీ దాసరికి అనారోగ్యం కారణంగా ఈ వేడుకకి హాజరు కాలేక పోయారు ఆయన తరపున చిరంజీవి ఈ అవార్డుని అందుకున్నారు. ఇక ఈ వేడుకకి మెగా స్టార్ చిరు తోపాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు అరవింద్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకకి హాజరైన అల్లు అర్జున్ మొహానికి మాస్క్ వేసుకుని కనిపించి అందరిని షాక్ కి గురి చేసాడు.
అలా బన్నీ మాస్క్ వేసుకుని ఈ వేడుకకి ఎందుకు హాజరయ్యాడో అర్ధం కాక అందరూ రకరకాలుగా అనుకోవడం మొదలు పెట్టారు. అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే' కోసమే బన్నీ అలా మొహానికి మాస్క్ కప్పేశాడనే వాదన బయలు దేరింది. ఇప్పటికే 'డీజే' దువ్వాడ జగన్నాథం లో అల్లు అర్జున్ బ్రాహ్మిణ్ లుక్ ని ఫస్ట్ లుక్ టీజర్ లో చూపించేసిన హరీష్ శంకర్.... మరో లుక్ ని దాచేసాడు. మరి రెండో పాత్ర లుక్ ని చూపించకుండా అల్లు అర్జున్ ఇలా ఈ వేడుకకి హాజరయినప్పుడు మాస్క్ ధరించి కనిపించాడని అంటున్నారు.
అయితే అలాంటిదేమి లేదని... అల్లు అర్జున్ 'డీజే' చిత్ర షూటింగ్ ప్రస్తుతం అబుదాబిలో జరుగుతుండడంతో అక్కడ వాతావరణం బాగాలేక అల్లు అర్జున్ కి జలుబు, దగ్గు తీవ్ర స్థాయిలో వచ్చాయట. అందుకే తన జలుబు ఎవరికీ సోకకుండా అల్లు అర్జున్ ఇలా మాస్క్ తో జాగ్రత్తలు తీసుకున్నాడట. అదండీ సంగతి లేకపోతె అల్లు అర్జున్ ఏదో దాచేసాడని అందరూ తెగ చెవులు కొరికేసుకున్నారు.