Advertisement
Google Ads BL

ట్రైలర్ : జయహో బాహుబలి జయహో..!


బాహుబలి ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా... అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఈ రోజు ఉదయం 'బాహుబలి2' ట్రైలర్ విడుదలతో పిచ్చెక్కిపోయింది. అలా వుంది 'బాహుబలి ద  కంక్లూజన్' ట్రైలర్ లో. అసలు సినిమా చూసినంత ఫీల్ కలిగిందంటే అది రాజమౌళి గొప్పతనమే అని చెప్పాలి. ఈ రోజు ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బాహుబలి ట్రైలర్ ని థియేటర్స్ లో విడుదల చేశారు. అలా థియేటర్స్ లో బాహుబలి ట్రైలర్ వస్తుందో లేదో ఇక్కడ సోషల్ మీడియాలో దాని ప్రభంజనం స్టార్ట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

ఇక 'బాహుబలి 2' ట్రైలర్ మాత్రం 'బాహుబలి పార్ట్ 1' కంటే వీర లెవెల్లో అదిరిపోయిందని చెప్పాలి. అంతకుమించి... అనిపించేలా ఈ 'బాహబలి 2' ట్రైలర్ ని కట్ చేసి తనకెవరూ సాటిరారు అని నిరూపించాడు రాజమౌళి. అసలు బాహుబలి 1 ని అసంతృప్తిగా చూపించి కొద్దిగా నిరాశ పరిచిన రాజమౌళి ఈ 'బాహుబలి పార్ట్ 2' లో మొత్తం కథనంతా చెప్పి అందరికి సంతృప్తి కలిగించాలని భావించినట్టున్నాడు. అందుకే అమరేంద్ర బాహుబలి ప్రభాస్ ని, భల్లాల దేవా రానాని , దేవసేన అనుష్కని, తమన్నా ని, కట్టప్పని, రాజమాత రమ్య కృష్ణ ని ఎలా చూపించాలో అలా చూపించి అరిపించేసాడు. యుద్ధం సీన్స్, రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ తో మొత్తం కలగలిపి 'బాహుబలి 2' ని అదరహో అనిపించేలా తెరకెక్కించాడని అర్ధమవుతుంది. 

మరి బాహుబలి 2  ట్రైలర్ తోనే రాజమౌళి ఇప్పటివరకు ఉన్న అంచనాలను అమాంతం గా 1000  రేట్లు పెంచేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చెయ్యడానికి ఏప్రిల్ 28 న సిద్దమవుతున్నాడు. ఒక్క బాహుబలి 1 తోనే సంచలనాలు నమోదు చేసిన రాజమౌళి అండ్ టీమ్ పార్ట్ 2  తో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో...ఒక్క నెల రోజులు ఓపిక పడితే తెలిసిపోతుంది. ఈ సినిమాకి కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం. ప్రతి ఒక్క కేరెక్టర్ ఆద్యంతం అలరిస్తుందని ట్రైలర్లోనే తెలిసిపోతుంది.

'నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా...' అంటూ అమరేంద్ర బాహుబలి  చెప్పే డైలాగ్ ను ఈ ట్రైలర్ లో చూపించి సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు. మరి అమరేంద్ర బాహుబలి కట్టప్పని అంతగా నమ్మితే కట్టప్ప అమరేంద్ర బాహుబలిని ఎలా చంపగలిగాడో... అనే దాని మీద కూడా రాజమౌళి క్యూరియాసిటీ ఇంకా పెంచేసాడు. మొత్తానికి ఎంతో కాలంగా జనాల్ని వేధిస్తున్న ఓ ప్రశ్నకు ఈ ట్రైలర్ సగం సమాధానం చెప్పినట్లే అనుకోవాలి. ఈ ట్రైలర్ చూసిన తెలుగు జాతి జయహో బాహుబలి జయహో అంటూ..బాహుబలి 2 కి, అది సృష్టించే రికార్డ్స్ కి స్వాగతం పలికేలా ట్రైలర్ ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  

Click Here to See the Bahubali 2 Trailer

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs