పవన్‌కళ్యాణ్ సాధారణంగా ఎవ్వరితో కలవడు. అంత:ర్ముఖుడు, తన భావాలను తనలోనే దాచుకుంటాడు. సిగ్గెక్కువ. ఎప్పుడూ ఒంటిరిగానే ఉండటానికి ఇష్టపడతాడు... ఇవన్నీ పవన్ మనస్తత్వం గురించి అందరూ చెప్పే మాటలు. కానీ ఆయనకు త్రివిక్రమ్ శ్రీనివాస్, అలీ ఇలా ఇద్దరు ముగ్గురితో మాత్రం మంచి స్నేహం ఉంది. వారితోనే సరదాగా ఉంటాడు. తన మనోభావాలు పంచుకుంటాడు. ఇక పవన్‌కి కెరీర్ మొదటి నుండి కమెడియన్ అలీతో ఎంతో మంచి రిలేషన్‌షిప్ ఉంది. ఆయన తన ప్రతిచిత్రంలో అలీకి ఓ రోల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలీతో కలిసి ఉంటే నాకు నటించడానికి కాస్త ధైర్యం ఉంటుందని ఆయన తరుచుగా చెబుతుంటాడు. తాజాగా విడుదలైన 'కాటమరాయుడు' మేకింగ్ వీడియోలో పవన్ అలీతో పాటు ఇతర యూనిట్‌తో సరదాగా గడిపిన క్షణాలను రికార్డు చేసి విడుదల చేశారు. అలీతో చెడుగుడు ఆడుకుంటున్నాడు. షూటింగ్ గ్యాప్‌లో సందడి సందడి చేశాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం లిరికల్ సాంగ్స్, టీజర్‌లతో పాటు మేకింగ్ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమ అభిమాన హీరో అంత సరదాగా ఉండటం చూసి ఆయన అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్‌తో పాటు ఈ చిత్రం టీజర్ వ్యూస్ కూడా రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇక ఈ 'రాయుడి జోరు' చూస్తే మాత్రం ఔరా అనకుండా ఉండలేం....!