Advertisement
Google Ads BL

టాలీవుడ్ ను తెగ మెచ్చుకుంటున్న హీరోయిన్.!


ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని సుచీలీక్స్ అంశం షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇలా  సుచిలీక్స్  తో ఆరంభమైన వివాదం కాస్త క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో మరింత వేడెక్కిందనే చెప్పాలి. దీంతో కొంత మంది సీనియర్ సుందరనటీమణులు కూడా జాయిన్ అయ్యి మద్దతు తెలపడంతో పరిశ్రమకు ఒకరకంగా చాలా పెద్ద మచ్చ పడినట్లుగానే తెలుస్తుంది. అయితే తాజాగా హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ టాలీవుడ్ ను పొగడ్తలతో ముంచెత్తింది. టాలీవుడ్ లో 'మిర్చి' సినిమాతో అభిమానులను సొంతం చేసుకున్న రిచా గంగోపాధ్యాయ తెలుగు, తమిళ సినీ పరిశ్రమపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ టాలీవుడ్ పై అమిత ప్రేమను వలకబోస్తుంది. కాగా ఈ విషయంపై రిచా స్పందిస్తూ...'టాలీవుడ్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఇటువంటి సెక్సీస్ట్ ప్రతిపాదనలను నేను ఎప్పుడూ ఎదుర్కొనలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ప్రతి రంగంలో కూడా మహిళలపై వేధింపులు తప్పనిసరి అయిపోయాయి. కేవలం సినీ పరిశ్రమకే అలాంటి వేధింపులు పరిమితం అంటూ ఆరోపణలు చేయడం సరికాదు' అని తెలిపింది రిచా. 

Advertisement
CJ Advs

ఇంకా రిచా గంగోపాధ్య మాట్లాడుతూ... తాను తెలుగు, తమిళం రెండింటిలోనూ సినిమాలు చేశానని, ఆ సమయంలో ఏ నటుడుగానీ, ఫిలిం మేకర్ గానీ తనపై అడ్వాన్స్ కావడానికి ప్రయత్నించలేదని తెలిపింది. చివరగా రిచా...ఎప్పుడైతే మహిళలు ధృడంగా ఉంటారో... అప్పుడు ఎలాగపడితే అలా ఏ పురుషుడూ అడ్వాన్స్ కావడానికి ప్రయత్నించడు అని తెలిపింది రిచా గంగోపాధ్యాయ. కాగా రిచా తెలుగులో 'లీడర్, మిరపకాయ్, మిర్చి' వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను రంజింపచేసిన విషయం తెలిసిందే.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs