మిగిలిన తనతోటి హీరోలు ఒక్క హిట్ కొట్టడానికే నానా తిప్పలు పడుతుంటే వరుస విజయాలతో నేచురల్‌స్టార్ నాని దూసుకుపోతున్నాడు. అరుదైన డబుల్ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నాడు. 'నేను... లోకల్' వంటి బ్లాక్‌బస్టర్‌తో ఈ ఏడాదిని అద్భుతంగా ప్రారంభించిన నాని ప్రస్తుతం శివ నిర్వాణ అనే కొత్త దర్శకునితో దానయ్య నిర్మాతగా 'నిన్నుకోరి' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ ఆ తర్వాత నాని చేసే చిత్రంపై మాత్రం ఎన్నో కన్‌ఫ్యూజన్స్‌ఉన్నాయి. ఆయన ఇప్పటికే తనకు 'కృష్ణగాడి వీరప్రేమగాధ' వంటి హిట్‌నిచ్చిన హను రాఘవపూడి, 'జ్యో అచ్చుతానంద'తో దర్శకునిగా హిట్ కొట్టిన యాక్టర్ కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల, దిల్‌రాజు నిర్మాతగా 'ఎం.సీ.ఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) అనే చిత్రం... ఇలా పలు చిత్రాలు కమిట్ అయివున్నాడు. ఈ చిత్రానికి వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. హను రాఘవపూడి ప్రస్తుతం 14 రీల్స్ పతాకంపై నితిన్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నాడు. సో.. ఈ చిత్రం పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఆయన మరోసారి దిల్‌రాజు బేనర్‌లోనే వేణుశ్రీరామ్‌తో 'ఎంసిఏ' చిత్రం పట్టాలెక్కింనున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ దిల్‌రాజు సతీమణి ఆకస్మిక మరణంతో ప్రస్తుతం దిల్‌రాజు దు:ఖ సాగరంలో ఉన్నాడు. శ్రీనివాస్ అవసరాల చిత్రానికి కూడా సమయం ఉంది. దీంతో నాని చేయబోయే చిత్రం నెక్ట్స్ ఏంటి? అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. మరి చూద్దాం... వీరి కోసమే నాని ఆగుతాడా? లేక మరో దర్శకుడు లైన్‌లోకి వస్తాడా? అనే ఆసక్తి అందరిలో కలుగుతోంది.