Advertisement
Google Ads BL

కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్..ఇప్పడు బాలీవుడ్!


సినిమాలలో దమ్ముండాలేగానీ వాటికి భాషా భేదాలు లేవని ఎన్నోసార్లు నిరూపితమైంది. కథలో కొత్తదనం ఉంటే చిన్న చిన్న చిత్రాలు, భారీ కాస్టింగ్‌లేని చిత్రాలు కూడా ఓ ఊపు ఊపుతాయని ప్రూవ్‌ అవుతూనే ఉంది. తాజాగా మరో కోలీవుడ్‌చిత్రం ఇదే కోవలోకి దూసుకుని పోతోంది. కేవలం 28 రోజుల్లో, సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయిన రహ్మాన్‌ ఉరఫ్‌ రఘు నటించిన '16' చిత్రం డిసెంబర్‌ 29న తమిళనాట విడుదలై ఘనవిజయం సాధించింది. క్రైమ్‌థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం 21 ఏళ్ల కార్తీక్‌నరేన్‌ అనే యువకుడు దర్శకుడు. కాగా ఇటీవలే తెలుగులో కూడా ఈ చిత్రం '16' పేరుతో అనువాదమై ఇక్కడ కూడా విశ్లేషకులను, కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. 'బిచ్చగాడు'తో ఘనవిజయం సాధించిన చదలవాడ బ్రదర్స్‌ ఈచిత్రాన్ని తెలుగులో అనువాదం చేశారు. కాగా మొదట్లో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలని భావించారు. కానీ సరైన నటుడు దొరకకపోవడంతోపాటు ఈ రీమేక్‌కి కూడా కార్తీక్‌నరేన్‌ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరని నిర్మాతలు భావించారు. కానీ కార్తీక్‌ నరేన్‌ బిజీగా ఉండటంతో ఎట్టకేలకు దీనిని అనువాదం మాత్రమే చేశారు. ఇది అభినందించదగ్గ నిర్ణయమని ఈ చిత్రం చూసిన వారెవరైనా ఒప్పుకుంటారు. మరోసారి తెలుగులో తీసినా కూడా ఆ ఎఫెక్ట్‌ రాదేమో అన్నట్లుగా ఈ చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసలు లభిస్తున్నాయి. కాగా ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్‌ మేకర్స్‌ని కూడా ఆకట్టుకుంది. దాంతో ఓ సీనియర్‌ హీరో ఈ చిత్రాన్ని తానే నిర్మించి ప్రదాన పాత్రలో తానే నటించడానికి నిర్ణయించుకున్నాడని సమాచారం. మరి ఆ హీరో ఎవరు? అనేది త్వరలోనే తెలుస్తుంది. మరి ఈ బాలీవుడ్‌ రీమేక్‌లో ఆ హీరో అసలు సత్తా తెలిసిపోతుందని, ఇది ఆయనకు ఓ పెద్ద చాలెంజ్‌గా పలువురు భావిస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs