Advertisement
Google Ads BL

అప్పుడే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ పై టాక్!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమా షూటింగ్ లో ఈ నెల 15 నుండి పాల్గొనబోతున్నాడు. డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కే జై లవ కుశ వర్కింగ్ టైటిల్ చిత్రంలో యంగ్ టైగర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్ర షూటింగ్ మొదలైనప్పటికీ ఎన్టీఆర్ ఇంతవరకు ఈ షూటింగ్ లో జాయిన్ అవకుండా తన బరువు తగ్గించే పనిలో పడ్డాడు. 'జనతా గ్యారేజ్' చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చేసింది ఎన్టీఆర్ కి... మరో చిత్రం చెయ్యడానికి. అందుకే తన బరువు తగ్గించుకుని జుట్టు పెంచుకుంటున్నాడట. జుట్టు పెంచుకుంటే మూడు వేరియేషన్ కేరెక్టర్స్ ని కవర్ చెయ్యొచ్చని డైరెక్టర్ బాబీ ఇలా సలహా ఇచ్చాడట. అయితే ఎన్టీఆర్ ఇంకా షూటింగ్ లో పాల్గొనలేదు, అప్పుడే ఎన్టీఆర్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ గురించి వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి.

Advertisement
CJ Advs

ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20  న విడుదల చెయ్యాలనే ప్లాన్ లో బాబీ అండ్ టీమ్ ఉన్నట్లు చెబుతున్నారు. మంచి స్టైలిష్ లుక్ తో ఎన్టీఆర్ ని చూపించాలని... ఆ లుక్ చూసి ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోవాలని అంటున్నారట. మూడు పాత్రల లుక్ ని రివీల్ చేస్తారని అందులో ఒక పాత్రని పూర్తిగా చూపించి మిగిలిన రెండు పాత్రలని చూపించి చూపించినట్టు చూపిస్తారని... అసలు ఇప్పటికే ఎన్టీఆర్ ఒక లుక్ ని డైరెక్టర్ బాబీ లాక్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి సినిమా మొదలు పెట్టి పెట్టకముందే ఇలా ఫస్ట్ లుక్ గురించి అప్పుడే ఇంత సీరియస్ గా ఆలోచించడం కొత్తగా వుంది. 

బాబీ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ  చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా... రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్స్ గా సెట్ అయినట్టు చెబుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో గెస్ట్ రోల్ తో పాటే ఐటెం సాంగ్ లో ఆడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs