అనూప్ రూబెన్స్ ఇప్పుడు దేవిశ్రీ కి, థమన్ కి గట్టి పోటీ ఇచ్చేలా కనబడుతున్నాడు. ఇప్పటికే నాగార్జున, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేసిన అనూప్ ఇప్పుడు తాజాగా పూరి - బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రానికి కూడా సంగీతం అందించనున్నాడని సమాచారం. అసలు ఇప్పటికే పూరి డైరెక్షన్ లో వచ్చిన 'హార్ట్ ఎటాక్, టెంపర్, ఇజం' చిత్రాలకు అనూప్ సంగీతాన్ని అందించాడు. మరి ఇప్పుడు అదే అనూప్ కి కలిసొచ్చి బాలకృష్ణ సినిమాకి సంగీతాన్ని అందించడానికి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.
నాగార్జున, అనూప్ ని నమ్మి 'మనం' వంటి పెద్ద చిత్రానికి ఛాన్స్ ఇచ్చాడు. అప్పటినుండి అనూప్ సుడి తిరిగింది. ఆ తర్వాత 'సోగ్గాడే చిన్ని నాయన'తో మరో అవకాశం ఇచ్చి అనూప్ కెరీకి హెల్ప్ చేసాడు నాగ్. ఇక అనూప్ లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోయింది. అలాగే మరో పెద్ద చిత్రం పవన్ - వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన 'గోపాల గోపాల'కి మ్యూజిక్ అందించాడు. ఇక ఇప్పుడు తాజాగా పవన్ చిత్రం 'కాటమరాయుడి'కి కూడా అనూప్ మ్యూజిక్ డైరెక్టర్. మరి ఇన్ని అవకాశాలతో ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ కి థమన్ కి గట్టి పోటీ ఇస్తున్న అనూప్ ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి కూడా సంగీతం అందిస్తే ఇక అతనికి టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ సరసన చేరిపోతాడు.
ఇక పూరి తననుకున్న బడ్జెట్ లో బాలయ్య చిత్రాన్ని చెయ్యడానికి ఇలాంటి వారిని తీసుకుంటున్నాడని గాసిప్ అయితే సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇక దేవిశ్రీ, థమన్ అయితే భారీ రెమ్యునరేషన్ సమర్పించాల్సి వస్తుందని అందుకే ఇలా అనూప్ ని సెలెక్ట్ చేసాడని అంటున్నారు. ఇక హీరోయిన్స్ విషయంలో కూడా పూరి ఇలాగే ఆలోచిస్తున్నాడనే ప్రచారం ఎప్పుడో మొదలైంది.