బెల్లం కొండ చుట్టూ సుందరీమణులు చేరి ప్రత్యేక గీతాలకు చిందులేయడం ఎలా ఉందంటే.. బెల్లం చుట్టూ ఈగలు నాట్యమాడుతున్నట్లుగా ఉంది. ఇలా బెల్లంకొండ సినిమాలో ఐటమ్ అంటే చాలు ఎంత క్రేజీ నాయికామణి అయినా అలా వారి సినిమాలో ఐటమ్ సాంగ్ కి తానూ రెడీ అనటం ఆనవాయితీగా మారింది. అంతే కాకుండా బెల్లంకొండతో నటించడం అన్నా కూడా స్టార్ హీరోయిన్లు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ఛాన్స్ కోసం పరితపిస్తుంటారు. బెల్లంకొండ శ్రీనివాస్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ లతో నటించడమే కాకుండా వారితో ఐటమ్ సాంగ్ లు కూడా చేస్తున్నాడంటే బెల్లం రుచి ఏపాటిదో అర్థమౌతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా నుండి ఐటమ్ పాపలకు రుచి మరిపాడు. తన మొదటి సినిమాలోనే సమంతతో ఆడిపాడాడు బెల్లంకొండ శ్రీనివాస్. అంతే కాకుండా స్టార్ హీరోయిన్ తమన్నాతో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ రెండు ఐటమ్ సాంగ్ లలో రెచ్చిపోయాడు. అయితే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న చిత్రానికి రకుల్‌ప్రీత్ సింగ్‌ని హీరోయిన్ గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్, శ్రీవాస్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ చిత్రానికి నాయికగా స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఆ స్థానం కీర్తి సురేష్ సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇలా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటేనే స్టార్ హీరోయిన్ లు సైతం ఆ హీరోకు ఉన్న గత సినిమాల తాలూకూ ట్రాక్ రికార్డులతో సంబంధం లేకుండా ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా ఓకే అనేస్తుందంటే ఏమిటా రహస్యం అంటూ అవాక్కవుతున్నారు ఫిల్మ్ జనాలు.
ఇంతటి మహత్తు బెల్లంకొండ ఎలా సంపాదించాడబ్బా అని ఒక్కసారి ఆలోచిస్తే... అందుకు సినీ క్రిటిక్స్ అంతా చెప్పేది ఒకేమాట. అదేంటంటే... బెల్లంకొండ సినిమా అంటే పారితోషికం దండిగా ఉంటుందని, సర్వం రాయల్ గా సమకూరుతాయని గౌరవాదరణలు చక్కగా ఉంటాయని చెప్తుంటారు సినీ వర్గాలు. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే బెల్లంకొండ తొట్టతొలిసినిమాకే సమంతకు మొత్తం రూ.2 కోట్లు వరకు ముట్టచెప్పినట్లుగా అప్పట్లో టాక్ నడిచింది. తమన్నాకు ఒక్కో ఐటమ్ సాంగ్ కు దాదాపు రూ.70 లక్షల తీసుకుందని ప్రచారం ఉంది. ఇంక రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికం రూ.80 లక్షలే అయినా ప్రత్యేకంగా బెల్లంకొండ సినిమా కదా మరి దాదాపు కోటింపాతిక వరకు ముట్టచెప్పేందుకు సిద్ధమైందంట. అదన్నమాట. అన్నట్టు.. తాజాగా కీర్తి సురేష్ కూడా అంతేనంటున్నారు సినీవర్గాలు. కీర్తి సురేష్ పారితోషికం సుమారు రూ.60 లక్షలు ఉంటుంది. కానీ.. ఇప్పడు బెల్లంకొండ రూ.80 లక్షలు వరకు ఇస్తానని ఒప్పేసుకున్నాడట. అదన్నమాట ఆ బెల్లం తాలూకూ నారీమణి నాట్యంలో ఉన్న అసలు రహస్యం.