Advertisement
Google Ads BL

మణిరత్నం ముగ్గురు హీరోలు వీళ్లేనా..!


రామ్ చరణ్ ధృవ చిత్రం తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక రొమాంటిక్ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆ చిత్రం కోసం రామ్ చరణ్ స్పెషల్ గా మేకోవర్ అవుతున్నాడు. ఇక ఈ చిత్రం  విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పక్క పల్లెటూరి ప్రేమ కథగా రూపొందుతుందని రామ్ చరణ్ మాస్ లుక్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ చిత్రంలో అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలు సమంత, రామ్ చరణ్ కి జోడిగా నటిస్తుంది.

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ మణిరత్నం డైరెక్షన్ లో నటిస్తాడని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అది అలాంటి ఇలాంటి చిత్రం కాదని మల్టి స్టారర్ చిత్రమని అంటున్నారు. ఆ మల్టీ స్టారర్ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు తమిళ నటులు విక్రమ్, విజయ్ లు నటిస్తున్నారని ఫిల్మ్ నగర్ లేటెస్ట్ న్యూస్. మరి ఇంత భారీ ప్రాజెక్ట్ ని తానే నిర్మిస్తానని అంటున్నాడట మణిరత్నం. ఇకపోతే ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ఏకంగా మూడు భాషల్లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించడానికి మణిరత్నం అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడని అంటున్నారు. 

మణిరత్నం హోమ్ బ్యానర్ మద్రాస్ టాకీస్ పతాకంపైనే నిర్మించే ఈ చిత్రం జూన్ 2017 నుంచి సెట్స్‌పైకి వెళుతుందని టాలీవుడ్ వర్గాల భోగట్టా. మరి ఈ భారీ మల్టీ స్టారర్ లో నటించడానికి చరణ్ ఓకె చెప్తాడేమో గాని విక్రమ్, విజయ్ లు ఒప్పుకుంటారా? లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నిజంగా ఈ మూవీ గనక తెరకెక్కితే ఈ చిత్రంపై అంచనాలను లెక్కలు గట్టడం ఎవరివల్ల అయ్యే విషయం కాదు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs