Advertisement
Google Ads BL

దిశ చూపేలా ఇరగదీసిందిగా.!


బాలీవుడ్ భామ దిశా పటానీ మంచి ఊపుమీదున్న విషయం తెలిసిందే.  అయితే ఈ నారీమణి చేతి నిండా సినిమాలతో మంచి మజా చేస్తూ ప్రొఫెషన్ ను ఎంజాయి చేస్తుందనే చెప్పాలి. దిశా పటాని ఇప్పటికి చేసిన నాలుగు సినిమాలలో మొదటిది తెలుగు సినిమా 'లోఫర్'. ఆ తర్వాత బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతటితో ఆగకుండా ఇంటర్నేషనల్ మూవీ కుంగ్ ఫూ యోగా చిత్రంలో జాకీ చాన్ సరసన నటించే చాన్స్ కొట్టేసి అందులో నటించేసింది కూడాను.

Advertisement
CJ Advs

దిశా పటానీ గురించి చెప్పాలంటే ముందుగా ఆమె వేసే స్టెప్పుల గురించే మాట్లాడాలి. ఎందుకంటే.. ఈ భామకు డ్యాన్స్ అంటే మహా ఇష్టం. అదేంటో గానీ ఆమె నడిచినా కులుకుతున్నట్లుగా ఉంటుంది అందుకేనేమో... దుమ్మురేపేలా, పిచ్చపిచ్చగా డ్యాన్స్ చేయడం అంటే ఆమెకు సరదా. అందుకు నిదర్శనంగా అప్పట్లో 'లోఫర్' ఆడియో వేడుకలో కూడా దిశా పటానీ స్టేజీ పైనే చిందులేసి అందరి దృష్టినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అలా ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చి అటువైపు జారుకుంది గానీ ఇక్కడే గానీ ఉండి ఉంటే టాలీవుడ్ హీరోలకు సైతం పోటీ ఇచ్చేదనడంలో ఎలాంటి సందేహం లేదు.  

ఈ అమ్మడుకు డ్యాన్స్ చేయడం అంటే ఎంత ఇష్టమంటే తనకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ఆ సమయాన్ని డ్యాన్స్ కే వినియోగిస్తుందంట. అందులోనే అమ్మడు బోలెడంత ఆనందాన్ని అనుభవిస్తుంటుంది అంటుంటారు. అయితే ఆమె చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే మహా ఇష్టంతో విపరీతంగా సాధన చేసేదని చెప్తుంటారు జనాలు. ఆ డ్యాన్స్ లో ఆమె అమితానందానికి లోనై తన ప్రతిభను చాటుకుటుంది దిశాపటానీ.  అయితే తాజాగా ఈ దిశా పటానీ తొక్కిన చిందులు ఆమె సాధన చేసిన తీరు ఆమె పడుతున్న కష్టం తాలూకూ వీడియో ఒకటి అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది.

అసలు ఆ వీడియోను చూస్తే దిశాకు డ్యాన్స్ వెన్నతో పెట్టిన విద్యలా అనిపిస్తుంటుంది. దిశా వేసే ప్రతి స్టెప్ ను చాలా నిశితంగా గమనిస్తే ఏ ప్రొఫెషనల్ డ్యాన్సర్ సంభ్రమాశ్చర్యానికి లోనుకాకుండా ఉండడు అంటే నమ్మండి. ఎంతో సాధన చేసిన ఈ అమ్మడు ప్రతి కదలికలోనూ ఓ మెరుపు, ఓ పసందైన వయ్యారం, ఓ గమ్మత్తైన కులుకు దర్శనమిస్తుంది. ఇంతటి వయ్యారపు హొయలొలికే శారీరిక సౌష్టవం అందరికీ అబ్బదంటే నమ్మండి. అందుకే మరి సాధనమున పనులు సమకూరు ధరలోన అంటుంటారు మరి. ఎందులోనైనా కృషి, పట్టుదల, అంకితభావం అన్నవి ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం కాకపోదు. అదే దిశాపటానీ పట్టుకుంది. ఇప్పడు తక్కున సమయంలోనే ఎక్కువ క్రేజ్ కొట్టేస్తుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs