Advertisement
Google Ads BL

పవన్ కి డబ్బు అంత అవసరమా....!


పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పాల్గొనాలంటే తన చేతిలో ఉన్న మూడు సినిమాలను త్వరగా కంప్లీట్ చెయ్యాలని నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమాలు కూడా కేవలం డబ్బుల కోసమే చేస్తున్నానని.... తన దగ్గర నయా పైసా లేదని... ఎన్నికల్లో పాల్గొనడానికి డబ్బు అవసరం కాబట్టే సినిమాల్లో నటిస్తున్నానని స్పష్టం చేసాడు పవన్. అందుకే ఒక్కసారే మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు పవన్. ముందుగా డాలి డైరెక్షన్ లో 'కాటమరాయుడు' ని చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి రెడీగా వున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండి సెట్స్ మీదకెళ్లబోతుంది. ఇక మూడో చిత్రం నేసన్ దర్శకత్వంలో ఏ .ఎమ్. రత్నం నిర్మాణంలో తెరకెక్కే చిత్రానికి కూడా పవన్ కమిట్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

ఇక ఈ మూడు చిత్రాలతోనే బిజీ గా వున్న పవన్ తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్ లో పెడుతున్నాడని వార్తలొస్తున్నాయి. వరస హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ ఒక సినిమాకి కమిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ - సుకుమార్ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పవన్ కళ్యాన్తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించే ఆలోచన చేస్తున్నారని టాక్. ఇప్పటికే పవన్ కి మైత్రి మూవీస్ వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. అసలు పవన్ 2019  ఎన్నికల నాటికీ ఎన్ని సినిమాలు వీలుంటే అన్ని సినిమాలు చెయ్యాలని భావించబట్టే ఇలా వరసబెట్టి సినిమాలు చేస్తున్నాడని అంటున్నారు.

ఇక మైత్రి మూవీస్ బ్యానర్ లో చెయ్యబోయే డైరెక్టర్ గురించి ఇంకా ఏ విషయము బయటకి రాలేదుగాని వారి బ్యానర్ లో సినిమా అయితే ఖచ్చితంగా వుంటుందనే సంకేతాలు వస్తున్నాయి. మరి ఎప్పుడూ డల్ గా సినిమాలు చేసే పవన్ ఇప్పుడు ఇంత స్పీడ్ గా సినిమాలు చేస్తూ అందరికి షాక్ అయితే ఇస్తున్నాడు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs