రోగ్ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాధ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ చిత్రం పూరీకి చాలా ముఖ్యం. ప్రస్తుతం పూరీకి పరిశ్రమలో అర్జెంటుగా ఓ హిట్ అవసరం. కాగా పరిస్థితుల అవసరాన్ని బట్టి పూరీ రోగ్ మూవీపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. అందుకనే సినిమా ప్రచారం విషయంలో పూరీ కొత్త కొత్త దారులు వెతుకుతూ వెరైటీగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రోగ్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ లో కిస్సులు, రొమాన్స్ సన్నివేశాలు ఎక్కువగా పెట్టేసి అందరినీ దర్శకుడు పూరి సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం ఆడియో లాంఛ్ కార్యక్రమానికి బాలీవుడ్ నుండి పోర్న్ స్టార్ ను పిలిపించనున్నట్లు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు అందాల ఆరబోతలో పేరుగాంచిన హాట్ భామ సన్నీలియోన్. ఈమెను రోగ్ ఆడియో కార్యక్రమానికి విచ్చేసి డ్యాన్స్ వేయాల్సిందిగా పూరీ కోరినట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఆమె ఒప్పుకొని భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లుగా కూడా టాక్ నడుస్తుంది. అయితే అలాగే ఆమె అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో రోగ్ ఆడియో వేడుకలో సన్నీలియోన్ అందాల విందు చేయడం ఖాయమైపోయిందేనంటుంది చిత్రబృందం. ఇంకేముంది రోగ్ ఆడియో వేడుకలో సన్నీ స్టేజ్ పై చిందులు వేయనుందన్నమాట.
అయితే ఇప్పటికే మన్నారా చోప్రా, ఏంజెలా లు చిత్రంలో వేడిపుట్టింస్తుండగా... ఇప్పుడు సరికొత్త వేడిని పెంచేందుకు ఆడియో వేడుకకు గరంగరం హాట్ సోకులతో వీనుల విందుతో పాటు కనులవిందు కూడా దండిగా దొరకనుందన్నమాట. కాగా ఇషాన్ హీరోగా పరిచయం చేస్తూ.. మరో చంటి గాడి ప్రేమకథ అంటూ దర్శకుడు పూరీ ఎంతో సీరియస్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇంకెన్ని మెరుపులు చూపెడతారో చూద్దాం.