Advertisement
Google Ads BL

మహేష్ సెట్స్ కి చిరు ఎందుకెళ్ళాడు..?


మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకొని జూన్ లో విడుదలకు సిద్దమవుతున్నా  కూడా ఆ చిత్రానికి సంబందించిన టీజర్ గాని మహేష్ బాబు లుక్ గాని ఇంతవరకు బయటికి రాలేదు. మరి మహేష్ - మురుగదాస్ మనసులో ఏముందో తెలియదు గాని ఆ చిత్ర విశేషాలు మాత్రం మీడియాకి పొక్కకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు కొత్త చిత్ర లుక్ కోసం మొహం వాచిపోయారు. ఇక ఈ సినిమాకి టైటిల్ అంటూ కూడా ఏది ఫైనల్ చెయ్యలేదు. ఏదో 'సంభవామి' అనే టైటిల్ మాత్రం మహేష్ బాబు చిత్ర  టైటిల్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్ర సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. స్పెషల్ గా వేసిన ఒక సెట్ లో మహేష్ సాంగ్ షూట్ లో పాల్గొనడానికి రెడీ అవుతుండగా అక్కడ మెగా స్టార్ చిరు ప్రత్యక్షమవడంతో సెట్ అంతా సందడిగా మారిపోయింది. ఇక చిరు.. డైరెక్టర్ మురగదాస్, మహేష్ బాబు తో కలిసి ఆ సాంగ్ రషెస్ ని తిలకించారట. అయితే సడన్ గా అక్కడికి చిరంజీవి వచ్చేసరికి ముందు యూనిట్ సభ్యులతో పాటు మహేష్ బాబు ఆశర్యపోయినప్పటికీ... చిరంజీవి తో కలిసి మహేష్ కూడా కలిసిపోయి సందడి చేశారట. అయితే చిరు అక్కడ ప్రత్యక్షమవడానికి కారణం మాత్రం చిరంజీవి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్లగా....  మహేష్ చిత్రం కూడా అక్కడే షూటింగ్ జరుపుకోవడంతో చిరు సర్ప్రైజింగ్ గా మహేష్ బాబు చిత్ర సెట్స్ కి వెళ్ళాడట.

మరి మెగాస్టార్, సూపర్ స్టార్ ఒకే చోట ఇలా కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇక చిరు, మురుగదాస్, మహేష్ కలిసి మహేష్ చిత్ర రషెస్ చూస్తున్న పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs