Advertisement
Google Ads BL

సుచి పై కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి!


సింగర్ సుచిత్ర కోలీవుడ్ ని ఒక ఆట ఆడుకుంటుంది. అక్కడ స్టార్స్  పర్సనల్ ఫొటోస్ ని ట్విట్టర్ లో లీక్ చేస్తూ స్టార్స్ గుండెల్లో దడ పుట్టించి ప్రకంపనలకు తెర తీసింది. ఎప్పుడు ఎలాంటి ట్వీట్స్ చేస్తుందో అని బిక్క చచ్చిపోయి ఎదురు చూస్తున్నారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతివొక్కరూ. మరోపక్క టాలీవుడ్ హీరో రానా ని కూడా ఇరుకున పడేసింది. మొదటగా సుచిత్ర ట్వీట్స్ కి బలైన వారు రజినీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ హీరో అయిన ధనుష్. ధనుష్, త్రిష తో క్లోజ్ గా ఉన్నప్పటి ఫొటోస్ ని ట్విట్టర్ లో పెట్టి షాక్ కి గురి చేసిన సుచిత్ర ధనుష్ తోపాటే, శింబు, అనిరుద్, హన్సిక, టివి నటి, ఆండ్రియా, రానా మొదలుగు వారు పర్సనల్ పార్టీల్లో ఎంజాయ్ చేసేటప్పుడు తీసిన ఫొటోస్ ని ట్విట్టర్ లో పెట్టి సినీతారల తెరవెనుక బాగోతాలు అంటూ క్యాప్షన్ తగిలించి మరీ ఆయా హీరో హీరోయిన్స్ కి కంటి మీదకి కునుకు రానియ్యకుండా వేపుకు తింటుంది. 

Advertisement
CJ Advs

అయితే సుచిత్ర మాత్రం నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది... నాకేం తెలియదని కలరింగ్ ఇస్తుంది. మరోపక్క సుచి భర్త కార్తీక్ మా ఆవిడకి మానసిక ఆరోగ్యపరిస్థితి బాగోలేదంటాడు. అసలిదంతా ఒకెత్తయితే సుచిత్ర తన భర్త కార్తీక్ కి విడాకులిస్తోందని చెబుతున్నారు. మరి ఇప్పటికే సూచి లీక్స్ కోలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతుంటే ఆయా హీరో హీరోయిన్స్ మాత్రం ఈ విషయమై ఇప్పటివరకు స్పందించడం లేదు. అయితే తాజాగా ధనుష్ సిస్టర్ సుచి లీక్స్ పై ఇండైరెక్టుగా స్పందించింది. మరోపక్క త్రిష కూడా డైరెక్టుగా స్పందించకుండా ఇండైరెక్టుగా ఏదో కొటేషన్ చెబుతోంది. 

ఇక ధనుష్ సిస్టర్ అయితే ఈమధ్యన మమ్మల్ని రకరకాల సమస్యలు వేధిస్తున్నాయంటూ... ట్విట్టర్, పేస్ బుక్ లు ఏదైనా మాట్లాడడానికి, ఏదైనా పోస్ట్ చెయ్యడానికి వేదికగా మారాయని... ఫేక్ వీడియోస్ తోపాటు ఫేక్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పరిస్థితికి కొందరు దిగజారారని... ఘాటుగా స్పందిస్తోంది. ఈ పోస్టులని తమ కుటుంబం అంతా గమనిస్తోందని... ఈ ట్విట్టర్ వ్యవహారంపై తాము పోరాటానికి సిద్ధమని సవాల్ విసురుతోంది. ఇలాంటి ట్వీట్స్ వల్ల తాము చాలా బాధపడుతున్నామని... ఇలా నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి అనడంలేదని తమని బాధపెట్టిన వారిని  మాత్రమే ఇలా అడుగుతున్నామని... ఇకనైనా ఇలాంటి పోస్ట్ లను ఆపమని ప్రాధేయపడుతోంది. 

ఇక ఈ వ్యవహారంలో అందరికన్నా ఎక్కువగా చిక్కుకుపోయిన త్రిష కూడా సుచి లీక్స్ పై ఇండైరెక్ట్ గా స్పందించింది. కర్మ అంటూ టైటిల్ పెట్టి..... 'పగ ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కూర్చుని సైలెంట్ గా చూస్తూ ఉండండి. మిమ్మల్ని బాధపెట్టిన వారు.. వారంతట వారే సర్వ నాశనం అయిపోతారు. మీకు గనక అదృష్టం ఉంటే.. వాళ్ల నాశనాన్ని మీ కళ్లతో చూసే అవకాశం మీకు దేవుడు ఇస్తాడు....’ అంటూ ఘాటుగా స్వీటుగా సుచి లీక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs