Advertisement
Google Ads BL

బాహుబలి2, 2.0 లకు పొంచి ఉన్న ముప్పు!


40ఏళ్ల నుంచి డబ్బింగ్‌ చిత్రాలను నిషేధిస్తూ వచ్చిన కర్ణాటక సినీ పరిశ్రమలో ఇప్పటికీ ఆ వేడివాడి తగ్గడం లేదు. డబ్బింగ్‌ చిత్రాలను చూసే హక్కు తమకుందని, దీనివల్ల కన్నడ సినీ పరిశ్రమకు, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, చివరికి ఎగ్జిబిటర్లకు కూడా మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. డబ్బింగ్‌చిత్రాల పోటీ వల్ల కన్నడ పరిశ్రమలో నిర్మితమయ్యే చిత్రాలలో కూడా క్వాలిటీ పెరుగుతుందని వాదించే వారు ఉన్నారు. వారిలో కిచ్చా సుదీప్‌ వంటి వారు ఉన్నారు. కానీ సుదీప్‌, ఉపేంద్ర వంటి వారికి తమిళ, తెలుగు భాషల్లో కూడా నటునిగా గుర్తింపు ఉన్నందువల్లే తమ స్వప్రయోజనాల కోసమే డబ్బింగ్‌ చిత్రాల వల్ల మేలు జరుగుతుందనే వాదన వినిపిస్తున్నారని కొన్ని కన్నడ సంఘాలు, కన్నడ నటీనటులు తప్పు పడుతున్నారు. ఇతర చిత్రాల డబ్బింగ్‌లను మొదలుపెడితే ఇతర భాషల నుంచి మరీ ముఖ్యంగా టాలీవుడ్‌ యంగ్‌స్టార్స్‌ నుంచి తమకు ముప్పు తప్పదని అక్కడి కొందరు వాదన వినిపిస్తున్నారు. 

Advertisement
CJ Advs

కాబట్టి మన రాష్ట్రం- మన భాష - మన థియేటర్లు అనే వాదన వినిపిస్తున్నారు. వాస్తవానికి కన్నడలో పలువురు స్టార్‌ హీరోలు నటించేవి మన చిత్రాల రీమేక్‌లే. ఇక అక్కడ డైరెక్టర్స్‌గా ఏలుతున్న వారు కూడా తెలుగులో సరైన అవకాశాలు రాని, ఇక్కడ ఫేడవుట్‌ అయిన దర్శకులే కావడం గమనార్హం. ఇక తన టాలెంట్‌తో కన్నడను ఓ ఊపు ఊపిన సాయికుమార్‌ని అడ్డుకోవడం చేతకాక, వారు ఎన్నో రాజకీయాలు చేసి ఆయనను బాగా అణగదొక్కారు. కానీ ఈ విషయంలో మన తెలుగు వారి కంటే కన్నడిగులే మేలని ఒప్పుకోవాలి. కన్నడలో తన స్టార్‌ వాయిస్‌తో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆపీసర్‌గా తన సత్తా చాటే వరకు తెలుగు వారికి సాయిలోని టాలెంట్‌ కనిపించలేదు. ఆయనను అందరూ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా వాడుకున్నారే గానీ నటునిగా మాత్రం ఆయన సత్తాని కనుగొనలేకపోయారు. ఇక థ్రిల్లర్‌ మంజు వంటి వారికి కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఉండేది.

కాగా 40ఏళ్ల నుంచి వస్తున్న డబ్బింగ్‌చిత్రాల నిషేధాన్ని ఎదిరించి తమిళ స్టార్‌ అజిత్‌ తన 'ఎన్నై అరిందాల్‌' చిత్రాన్ని కన్నడలో 'సత్యదేవ్‌ ఐపియస్‌'గా డబ్‌ చేశాడు. ఈ చిత్రాన్ని థియేటర్లలో ఆడనివ్వకపోవడం, చూసేందుకు ప్రేక్షకులున్నా థియేటర్ల యాజమాన్యాలు కూడా ఆ చిత్రాన్ని ఆడిస్తే థియేటర్లనే తగలబెడతామని బెదిరించడంతో చిత్రాన్ని ప్రదర్శించలేదు. దీంతో కన్నడ డబ్బింగ్‌ నిర్మాత నుంచి పంపిణీదారుల వరకు అందరూ నష్టపోయారు. కానీ పలువురు నెటిజన్లు మాత్రం 'బాహుబలి, 2.0' వంటి చిత్రాలను తమ భాషలోకి డబ్‌ చేసి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఈ రెండు చిత్రాలనే కాకుండా అనేక చిత్రాలను అనువాదం చేయాలని భావించిన నిర్మాతలకు డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. ఇవి కన్నడలో స్ట్రెయిట్‌గా రిలీజ్‌ చేయడం తప్పితే డబ్బింగ్‌ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి 'బాహుబలి- దికన్‌క్లూజన్‌'తో పాటు '2.0' వంటి చిత్రాలకు కన్నడ మార్కెట్‌ తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది, ఏదిఏమైనా ఇలాంటి సున్నిత విషయాలలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఓకే విధానాన్ని కేంద్రాలు అనుసరించాలనే డిమాండ్‌ మరలా మొదలైంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs