Advertisement
Google Ads BL

విక్టరీ వెంకటేష్‌ కూడా రేసులోకొస్తున్నాడు!


నిజానికి తెలుగులో శోభన్‌బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎక్కువగా కలిగిన హీరోగా సీనియర్‌స్టార్‌ వెంకటేష్‌ని చెప్పుకోవాలి. కానీ ఆయన మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా తాను చెప్పే మాటలను, సిద్దాంతాలను ఆచరిస్తూ ఉంటారు. పాజిటివ్‌ థింకింగ్‌ ముఖ్యమని, సింప్లిసిటీని మెయిన్‌టెయిన్‌ చేయాలని చెప్పే ఆయన ఆ విషయాలను తన నిజజీవితంలో కూడా పాటిస్తుంటారు. ఎక్కువ ఆధ్యాత్మిక చింతన కలిగిన ఆయన ఎప్పుడు నెంబర్‌ గేమ్స్‌ కోసమో, లేక కలెక్షన్ల విషయంలో మాత్రం ఎప్పుడూ తాపత్రయపడడు. తన అభిమానులకు రోల్‌ మోడల్‌గా ఉంటారు. భేషజాలు లేకుండా ఇతర హీరోలతో కలిసి నటించేందుకు ముందుంటాడు. తాను సూపర్‌ఫామ్‌లో ఉన్న రోజుల్లో కూడా సినిమా టైటిల్‌ తన పవర్‌ను జస్టిఫై చేసే విధంగా ఉండాలని ఆయన డిమాండ్‌ చేయరు. కథానుసారంగా 'సంక్రాంతి, నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి, ఘర్షణ' ఇలా తనదైన పంథాలో వెళ్లేవాడు. ఇక ప్రస్తుతం సీనియర్‌స్టార్‌గా మారిన తర్వాత ఆయన తన వయసుకు తగ్గ పాత్రను ఎంచుకుంటున్నాడు. ఇక ఆయన కెరీర్‌లో ఎక్కువ హిట్స్‌ రీమేక్‌ ద్వారానే వచ్చాయి. కానీ ఆ విషయాన్ని కూడా ఆయన ఎంతో పాజిటివ్‌గా తీసుకొని అదీ ఒక అదృష్టమే కదా...! అంటుంటాడు. 

Advertisement
CJ Advs

కాగా ఈమధ్య వెంకీ కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. యంగ్‌హీరోలతో కలిసి నటిస్తూనే 'దృశ్యం' వంటి చిత్రాలతో తన సత్తా చాటుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌ మూవీ 'సాలా ఖద్దూస్‌' కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'గురు' చిత్రంలో మిడిల్‌ ఏజ్‌డ్‌ బాక్సింగ్‌ కోచ్‌గా కనిపించనున్నాడు. హిందీ, తమిళంలో మాధవన్‌ చేసిన పాత్రను ఆయన తెలుగులో చేస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం ఏప్రిల్‌లో సమ్మర్‌ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ ఇప్పటికే విడుదలై అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటోంది. ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు కూడా చివరి దశకు వచ్చాయి. ఈ చిత్రంలో ఓ యూత్‌ఫుల్‌ సాంగ్‌ను స్వయాన విక్టరీ వెంకటేష్‌ స్వయంగా పాడాడని సమాచారం. దీంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సాంగ్‌ ఈ చిత్రానికే హైలైట్‌ అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ పాట సాహిత్యం కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా, యువతను మేల్కొలిపే విధంగా ఉంటుందని, అందుకు వెంకీ ఈ పాటను తానే పాడాలని నిర్ణయించుకున్నాడట. ఈ పాట రికార్డింగ్‌ కూడా జరిగిపోయింది. కాగా ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు. హిందీ, తమిళ భాషల్లో డైరెక్ట్‌ చేసిన సుధా కొంగరనే ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కానుంది. శ్రీప్రియతో పాటు సుధాకొంగర వంటి లేడీ డైరెక్టర్స్‌ను ప్రోత్సహిస్తున్నందుకు ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs