Advertisement
Google Ads BL

ఈసారి గొడవకి కారణం కూతురట!!


ఆ మధ్యన బాలీవుడ్ లో ఐశ్వర్యకు అభిషేక్ బచ్చన్ కి విభేదాలొచ్చినట్టు మీడియా కోడై కూసింది. వాళ్ళిద్దరి మధ్యనే కాకుండా బచ్చన్ ఫ్యామిలీ కూడా ఐష్ తో అంటుముట్టనట్లు ఉంటుందని ప్రచారం జరిగింది. అసలు ఈ విభేదాలు ఐష్ సినిమాల్లోకి రీఎంట్రీ లో నటించిన 'యే దిల్ హే ముష్కిల్’ లో ఐశ్వర్య, రణబీర్ కపూర్ తో చేసిన రొమాంటిక్ సీన్స్ ని చూసిన అమితాబచ్చన్, అభిషేక్, జయ లు ఐష్ మీద కోపంగా ఉన్నట్లు.... ఆ సినిమాని తెరకెక్కించిన కరణ్ జోహార్ ని కూడా అమితాబ్ కోప్పడినట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఐష్ మాజీ ప్రియుడు సల్మాన్ తో సినిమా చెయ్యొద్దని అభిషేక్, ఐష్ కి ఆంక్షలు కూడా విధించినట్లు ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఒట్టిపుకార్లే అని అమితాబ్ ఫ్యామిలీ కొట్టిపడేసింది. ఆ సంఘటన అనంతరం ఐశ్వర్య రాయ్ తో కలిసి బచ్చన్ ఫ్యామిలీ చేసిన పూజలతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు తాజాగా మళ్ళీ అభిషేక్, ఐష్ లు ఇరువురూ ఒకోనొక కారణంగా గొడవలు పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈసారి వీరి గొడవకి కారణం అభిషేక్, ఐష్ ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ అట. చిన్న పిల్ల వల్ల వీరు గొడవపడటం ఏమిటా? అనుకుంటున్నారా.  ఆరాధ్యను చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచేయాలన్నది అభిషేక్ ఆలోచనట. కానీ ఈ ఆలోచనకు ఐష్ బ్రేక్ వేసిందట. అసలు ఐశ్వర్య కి ఆరాధ్యను అప్పుడే నటనకు పరిచయం చెయ్యడం ఏమాత్రం ఇష్టం లేక అభిషేక్ చెప్పిన దానికి నో చెప్పిందట. కానీ అభిషేక్ మాత్రం ఆరాధ్యని ఎలాగైనా నటింపచేయాలనే పట్టుదలతో ఉన్నాడట. అందుకే వీరిద్దరి మధ్యన విభేదాలు వచ్చినట్టు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అసలు ఇది నిజమా లేకా గాసిప్పా అనేది మాత్రం తెలియాల్సి వుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs