అక్కినేని నాగార్జున... తెరపైనే కాకుండా తెర వెనుక కూడా ఎంతో హుందాగా, జాలీగా, ఎలాంటి ఇగోలు లేకుండా జోవియల్‌గా ఉండేతత్వం. తాజాగా ఆయన ఎంతో కష్టపడి నటించిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం డిజాస్టర్‌తో పాటు ఆయన చిన్నకుమారుడు అక్కినేని అఖిల్‌కు జీవీకెరెడ్డి మనవరాలు శ్రియాభూపాల్‌లకు నిశ్చితార్దం తర్వాత పెళ్లి ఆగిపోవడంతో నాగ్ ఎంతో అప్‌సెట్‌గా ఉంటున్నాడట. ఇప్పటికే ఫోన్ నెంబర్ కూడా మార్చిన ఆయన ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజు గారి గది2'లో మెంటలిస్ట్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొదట నాగ్ ఈ చిత్రంలోని తన పార్ట్ షూటింగ్‌ను కూడా వాయిదా వేయమని దర్శకనిర్మాతలకు కోరాడని సమాచారం. కానీ అమల మాత్రం ఆయన ఏదైనా పనిలో పడితే అయినా ఆ మూడ్ నుంచి బయటకు వస్తాడని భావించి, షూటింగ్‌కు పంపిస్తోందట.
ఇక ఈ చిత్రం సెట్స్‌లో కూడా నాగ్ ఎవ్వరితో మాట్లాడకుండా, తన సీన్ షూట్ అయిపోగానే ఒక్కడే ఒక మూలకు వెళ్లి ఒంటరిగా కూర్చుంటున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇక అదే సమయంలో అక్కినేని అఖిల్ రెండో చిత్రం షూటింగ్‌ను కూడా వెంటనే ప్రారంభించడం మంచిదని నాగ్‌కు ఆయన సన్నిహితులు సలహా ఇచ్చారని, దాంతోనే త్వరలో ఆయన విక్రమ్‌కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్, మేఘాఆకాష్‌లు కలిసి నటించే రెండో చిత్రానికి నిర్మాతగా కూడా బిజీ కావాలనే నిర్ణయానికి వచ్చాడని సమాచారం. కాగా ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ను రప్పిస్తున్నారు. మొత్తానికి తన మూడ్ నుంచి బయటకు వచ్చేందుకు ఆయన అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు.