పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో 'రోగ్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఇషాన్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు పూరి. అయితే 'రోగ్' చిత్రం టీజర్ ని చూసిన వారంతా పూరి గత చిత్రాల వలే ఉందని ఏమాత్రం కొత్తదనం కనిపించడం లేదని అంటున్నారు. మరో పక్క ఈ చిత్రానికి సంబంధించి ఒక షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. అదేమిటంటే 'రోగ్' చిత్రాన్ని ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది.
అదేమిటి ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా లు నటిస్తున్నారుగా అనుకున్నారేమో.. వీళ్లకన్నా ముందు ముగ్గురు హీరోయిన్స్ ఈ చిత్రం నుండి తప్పనుకున్నారట. మన్నారా, ఏంజెలా కు ముందు ఈ చిత్రంలో నేహా శర్మ చెల్లి అయేషా ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టేశారట. అయితే రెండు మూడు రోజుల షూటింగ్ తర్వాత ఈ సినిమా చేయలేనని అయేషా వెళ్లిపోయిందట. ఆ తర్వాత మళ్ళీ అమైరా దస్తూర్ ను ఎంపిక చేసి షూటింగ్ మొదలు పెట్టగా ఆమెకూడా అయేషా వలే ఈ సినిమా నుండి జంప్ అయ్యిందని చెబుతున్నారు. ఆమె తర్వాత పూజా జవేరిని సెలెక్ట్ చెయ్యగా ఆమెకూడా ఒక్కరోజు షూటింగ్ కే బై చెప్పేసి వెళ్లిపోయిందని అంటున్నారు.
మరి ఈ ముగ్గురు హీరోయిన్స్ ఎందుకలా చేశారో అని అందరూ ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నారట. అలాగే ఆ హీరోయిన్స్ రిజెక్ట్ చేసిన ఈ 'రోగ్' సినిమాని మన్నారా, ఏంజెలా లు ఎలా ఒప్పుకున్నారో అని ఒకటే గుసగుసలు వినబడుతున్నాయి. ఇకపోతే ఈ 'రోగ్' టీజర్ చూసిన వారంతా మన్నారా, ఏంజెలా లు రెచ్చిపోయి అందాలు ఆరబోశారని చెబుతున్నారు. మరి అలా అందాల ఆరబోతకు దిగలేకే ఆ హీరోయిన్స్ 'రోగ్' సినిమా నుండి తప్పుకున్నారో? లేక మరేదైనా కారణమో అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా పూరి మరీ స్పైసీగా ఈ చిత్రాన్ని తీసాడేమో అందుకే హీరోయిన్స్ అలా జంప్ అయిపోయారనే టాక్ కూడా వినబడుతుంది. చూద్దాం ఏం జరిగిందో తెలియాలంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే.