Advertisement
Google Ads BL

మెగామేనల్లుడి లవ్ ని రిజెక్ట్‌ చేసిందంట..!!


మెగామేనల్లునిగా ఎంట్రీ ఇచ్చి తన చిత్రాల ద్వారానే కాదు.. పలు విషయాలలో వార్తల్లో నానుతున్న హీరో సాయిధరమ్‌తేజ్‌. అన్ని ఫ్యామిలీల హీరోలను కలుపుకుపోవడం, సీనియర్‌స్టార్స్‌ని కూడా పొగడ్తలతో ముంచెత్తడం, మహేష్‌ బావ సుధీర్‌బాబు తనయుడుకి 'విన్నర్‌'లో ఓ మంచి పాత్రను ఇచ్చి తద్వారా మహేష్‌ ద్వారా ఈ చిత్రంలోని ఓ పాటను రిలీజ్‌ చేయించడం వరకు ఈయన లౌక్యాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇక మెగాఫ్యామిలీ హీరోలలో ఎవ్వరిపై లేనన్ని లవ్‌ రూమర్లు సాయి విషయంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. రెజీనా, రకుల్‌ప్రీత్‌సింగ్‌లతో ఈయనకు ఎఫైర్‌ ఉందంటూ ఇబ్బడిముబ్బడిగా వార్తలు వస్తున్నాయి. 'విన్నర్‌' చిత్రం షూటింగ్‌ విదేశాలలో జరుగుతుండగా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ పర్సనల్‌ బ్యాగ్‌లో ఈ హీరోగారి ఫొటో బయటపడిందని ఎన్నో వార్తలు వచ్చాయి. 

Advertisement
CJ Advs

దీనిపై ఆయన మాట్లాడుతూ, రెజీనా, రకుల్‌ల గురించి మాట్లాడతాడనుకుంటే తాజాగా మరో ముద్దుభామతో తన లవ్‌ప్రపోజల్‌ను బయటపెట్టాడు. తాను ఓ భామకు లవ్‌ప్రపోజ్‌ చేశానని, కానీ ఆమె తన ప్రేమను రిజెక్ట్‌ చేసిందని వ్యాఖ్యానించాడు. ఇంతకీ ఆ భామ ఈ మెగా మేనల్లుడి లవ్‌ప్రపోజల్‌కి నో చెప్పడానికి కారణం ఆమెకు ఆల్‌రెడీ ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉండటమే కారణం అంటున్నాడు. తనతో 'తిక్క' చిత్రంలో నటించిన బ్రెజిల్‌ భామ లారీసాబోనేసీ. ఈమెకు మన సాయి లవ్‌ ప్రపోజల్‌ చేస్తే ఆమె తిరస్కరించడంతో చాలా డిజప్పాయింట్‌ అయ్యానంటున్నాడు. ఎలాగూ మన మీడియా వారు బ్రెజిల్‌ భామను వివరణ అడగలేరు కాబట్టి తెలివిగా రెజీనా, రకుల్‌ల విషయం దాటవేసి బ్రెజిల్‌ భామను తెరపైకి తెచ్చాడనే గుసగుసలు వినపడుతున్నాయి. మరి ఇవ్వన్నీ వార్తల్లో ఉండటానికో, లేక బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడిన 'విన్నర్‌'కు ప్రమోషన్‌గా ఉంటాయని భావించాడో గానీ... ప్రస్తుతం ఈ టాపిక్‌ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs