Advertisement
Google Ads BL

స్టార్ స్టేటస్ కోసం రానా ప్రయత్నాలు..!


దగ్గుబాటి రానా నటించిన తొలి టాలీవుడ్‌ మూవీ 'లీడర్‌'. శేఖర్‌కమ్ముల తీసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకొంది. రానాలోని నటుడిని బయటకు తీసింది. కానీ రానాకు మాత్రం సోలో హీరోగా హిట్‌ ఇవ్వలేకపోయింది. కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఇక ఆ తర్వాత నుంచి రానా తన పంథాను మార్చుకున్నాడు. 'బాహుబలి'తో పాటు తాజాగా 'ఘాజీ'తో తన సత్తా చూపించాడు. తేజ దర్శకత్వంలో మరో పొలికల్‌ థ్రిల్లర్‌గా 'నేనే రాజు.. నేనే మంత్రి' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో సోలో హీరోగా తన స్థానం పదిలం చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఫేడవుట్‌ అయిన దర్శకుని తేజలోని టాలెంట్‌ని నమ్మి ఈ చిత్రం చేస్తున్నాడు. అలాగే '1945' టైటిల్‌తో సత్యశివ అనే దర్శకునితో తమిళ, తెలుగు భాషల్లో మరో పీరియాడికల్‌ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాల తర్వాత కూడా తనదైన విభిన్న పాత్రలను చేస్తూనే, సోలోహీరోగా కూడా స్ధిరపడాలని, నెగటివ్‌ షేడ్స్‌, అతిథి పాత్రలు, అన్నిబాషా చిత్రాలను చేస్తూనే టాలీవుడ్‌లో సోలో హీరో కలను నెరవేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే పెద్దగా కమర్షియల్‌ సక్సెస్‌ కాకపోయిన కూడా తన మనసుకు నచ్చిన 'లీడర్‌' చిత్రానికి సీక్వెల్‌ చేయాలనే ఆలోచనలో రానా ఉన్నాడని సమాచారం. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం శేఖర్‌కమ్ముల.. వరుణ్‌తేజ్‌తో 'ఫిదా' చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తనతో 'కృష్ణం వందే జగద్గురం' వంటి అద్భుతమైన చిత్రాన్ని చేసిన క్రిష్‌ వైపు కూడా ఆసక్తిగా చూస్తున్నాడట. క్రిష్‌ తీసిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' 50రోజులు పూర్తి చేసుకొని, కమర్షియల్‌గా బాగానే వసూలు చేసిన నేపథ్యంలో క్రిష్‌ బిజీ అవుతాడని అందరూ భావించారు. కానీ ప్రస్తుతానికి మంచి హీరోలందరూ బిజీగా ఉన్నారు. వెంకీ చిత్రం హఠాత్తుగా ఆగిపోయింది. ఈ దశలో క్రిష్‌.. వరుణ్‌తేజ్‌తో తీయాలని భావించి, ఆగిపోయిన 'రాయబారి' చిత్రాన్ని తాను చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో రానా ఉన్నాడని సమాచారం. తన ఫిజిక్‌కి స్పై చిత్రమైతే బాగా సూట్‌ అవుతుందని ఆయన భావిస్తున్నాడట. ఇక ఇలాంటి చిత్రాలకు తెలుగులోనే కాదు.. కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఈ చిత్రానికి అయ్యే బడ్జెట్‌పైనే రానా తండ్రి సురేష్‌బాబు దృష్టి సారించాడని అంటున్నారు. ఇక ఈ రెండు చిత్రాలు తెరకెక్కితే తనకి టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ వస్తుందని రానా భావిస్తున్నాడని..అతని సన్నిహితులు అనుకుంటున్నారు.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs